ఏపీ ఐటీ రాజధాని.. పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతున్న విశాఖకు తాజాగా మరో లక్ష కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు రానున్నాయి. ఇప్పటికే గూగుల్ డేటా కేంద్రం రాకతో.. అనేక పెట్టుబడులు విశాఖను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల ఇక్కడ జరిగిన పెట్టుబడుల సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల వరకు ఒప్పందాలు జరిగాయి. వీటిలో ప్రతిష్టాత్మక కంపెనీల నుంచి దేశ విదేశీ పెట్టుబడి దారులు ఉన్నారు. మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, మాల్స్, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు రాను న్నాయి.
ఈ పరంపరలో తాజాగా రిలయన్స్ రూ.98 వేల కోట్లు(దాదాపు లక్ష) పెట్టు బడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. వాస్తవానికి ఇప్పటికే.. రిలయన్స్ పెట్టుబడులు పెట్టింది. అయితే.. అవి తిరుపతి, విజయవాడ, కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాల్లో ఉండగా.. తాజాగా విశాఖకు కూడా వస్తున్నట్టు పేర్కొంది. విశాఖలో రిలయన్స్-జేవీ డిజిటల్ కనెక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 98 వేల కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనుంది.
దీని ద్వారా ఒక గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. సుమారు 1200-2000 మధ్యలో ఉద్యోగాలు లభించేందుకు అవకాశం ఉంటుందని.. పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఇక, ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ పెట్టుబడులకు డెస్టినేషన్‌గా మారుతోందని వ్యాఖ్యానించారు. ఈ మెగా – ప్రాజెక్ట్‌తో డేటా రంగంలో దేశానికి విశాఖ తలమానికం కానుందని, విశాఖ కీర్తి ప్రపంచం నలుమూలలకు విస్తరిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్రం పెట్టుబడుల కేంద్రంగా మారడానికి సీఎం చంద్రబాబు దూరదృష్టి కారణమని మంత్రి నారా లోకేష్ చెప్పారు. విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఏపీ ఎలా ముందుకు సాగుతుందో చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం మరింత పెరుగుతుందని నారా లోకేష్ తెలిపారు. తద్వారా.. రాష్ట్రంలో యువతకు.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయన్నారు.
This post was last modified on November 27, 2025 12:13 pm
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…
కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక వింత సంఘటన జరిగింది. రిసెప్షన్ వేదిక రెడీ, బంధువులంతా వచ్చేశారు, విందు భోజనాలు సిద్ధం. కానీ…