ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. అధికా ర పక్షం గురించి పక్కన పెడితే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తరఫున పలువురుఎమ్మెల్యేలు సభలో చర్చకు దిగుతున్నారు. సరే.. వివాదాలు.. సస్పెన్షన్ల విషయాన్ని పక్కన పెడితే.. పలువురు ఎమ్మెల్యేలు తమ సమస్యలను సభ దృష్టికి తెస్తున్నారు. దీంతో ఒకరిద్దరుమంత్రులు ఆయా సమస్యలపై దృష్టి పెట్టి.. పరిష్కరి స్తామంటూ.. హామీలు ఇస్తున్నారు. అయితే.. ఇదే టీడీపీ తరఫున గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో నలుగురు ప్రత్యక్షంగా వైసీపీకి మద్దతిస్తున్నారు.
చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, గన్నవరం సభ్యుడు వల్లభనేని వంశీ, విశాఖ నగర ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గిరిధర్‌ల పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు.. వారి అనుచరులు. కొన్నాళ్ల కిందట వీరంతా వైసీపీకి మద్దతుదారులుగా మారారు. అయితే.. అలాగని.. టీడీపీ సభ్యత్వం వదులుకునే పరిస్థితి లేదు. పోనీ.. వైసీపీకి అనుకూలంగా వాయిస్ వినిపిద్దామా. అంటే.. అది కూడా లేదు. నిజానికి సభలో సమస్యలు వినిపించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయా నియోజకవర్గాల్లో అబివృద్ది విషయంపై ప్రజల తరఫున గళం వినిపించాలని వీరికి కూడా ఉంది.
కానీ, సభలో ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడేందుకు మైక్ ఇవ్వమని స్పీకర్‌కు అభ్యర్థించాలి? టీడీపీ తరఫున గెలుపు గుర్రం ఎక్కారు కనుక ఆ పార్టీ తరఫున మైక్ ఇవ్వమని అడగాలి. కానీ, ఆ పార్టీతో విభేదించి.. వైసీపీకి మద్దతుగా మారారు కనుక.. అలా అడగలేరు. పోనీ.. వైసీపీ తరఫున అడుగుతారా? అంటే.. అది సాధ్యంకా దు. దీంతో ఆ నలుగురు ప్రజా సమస్యల విషయంలో మౌనం పాటిస్తున్నారు. వారికి మాట్లాడాలనే ఉన్నా.. వేసిన అడుగులు.. పార్టీల జంపింగులు ఇప్పుడు వారికి పెను శాపంగా మారాయి. మరి ఇలా ఎన్నాళ్లు మౌనంగా ఉంటారు? అనేది కీలక ప్రశ్న.
అంతేకాదు.. ప్రజా సమస్యలపై స్పందించరా? ప్రజల తరఫున వాయిస్ వినిపించరా? అంటే.. ఏమో అనే సమాధానమే వస్తుండడం గమనార్హం. ఏదేమైనా.. తాము తీసుకున్న గోతిలో తామే పడ్డారంటారే.. అలా ఉంది.. టీడీపీ జంపింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి. ఇలా అయితే.. వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు వీరిని నిలదీసే అవకాశం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. దేనినైనా భరించొచ్చు.. కానీ, ప్రజాగ్రహం పెల్లుబికితే మాత్రం కష్టమే అంటున్నారు. మరి టీడీపీ జంపింగులు ఎలా ప్రిపేర్ అవుతారో చూడాలి.
This post was last modified on December 3, 2020 10:09 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…