Political News

వైసీపీ కార్య‌క‌ర్త‌ల నోళ్లు మూయించిన జ‌గ‌న్

విశాఖ‌ప‌ట్నానికి ప్ర‌తిష్టాత్మ‌క‌ గూగుల్ డేటా సెంట‌ర్, ఏఐ హ‌బ్ రావ‌డం మీద వైసీపీ కార్య‌క్త‌లు గ‌త కొన్ని రోజులుగా ఎంత రాద్దాంతం చేస్తున్నారో, ఎన్ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారో తెలిసిందే. 80 వేల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డితో గూగుల్.. ఈ డేటా సెంట‌ర్‌, ఏఐ హ‌బ్‌ల‌ను ఏర్పాటు చేస్తుండ‌డం దేశ‌వ్యాప్తంగా చ‌ర్చనీయాంశం కాగా.. కూటమి ప్ర‌భుత్వం మీద స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిసింది. జ‌నాల్లో కూడా దీనిపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. 

కానీ వైసీసీ వాళ్లు మాత్రం గూగుల్ డేటా సెంట‌ర్ల వ‌ల్ల అస‌లు ప్ర‌యోజ‌న‌మే లేద‌ని.. దీని ద్వారా వ‌చ్చేవి కేవ‌లం 200 ఉద్యోగాల‌ని.. వేరే దేశాల నుంచి జ‌నాల వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకోలేక ఇండియాను వేదిక‌గా ఎంచుకున్నార‌ని.. డేటా సెంట‌ర్ల‌కు నీళ్లు భారీగా అవ‌స‌రం ప‌డ‌తాయ‌ని.. దీని వ‌ల్ల వైజాగ్‌లో నీటి స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని.. విద్యుత్ వినియోగం పెరిగి జ‌నం మీద భారం ప‌డుతుంద‌ని.. ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ తింటుంద‌ని..  ఇలా అనేక ప్ర‌తికూల‌త‌ల‌ను చూపించి ఇదొక వేస్ట్ వ్య‌వ‌హారం అన్న‌ట్లుగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

గూగుల్‌కు రాయితీలు ఇవ్వ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు.
ఐతే గ‌త వారం ప‌ది రోజులుగా గూగుల్ డేటా సెంట‌ర్‌కు వ్య‌తిరేకంగా అలుపెర‌గ‌ని పోరాటం చేస్తుంటే.. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రంగంలోకి దిగి వాళ్ల గాలి తీసేశారు. గూగుల్ డేటా సెంట‌ర్ గురించి ఆయ‌న చాలా సానుకూలంగా మాట్లాడారు. తాము దీన్ని ఎంత‌మాత్రం వ్య‌తిరేకించ‌డం లేద‌ని, ఆహ్వానిస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గూగుల్ డేటా సెంట‌ర్ వ‌ల్ల వ‌చ్చే ఉద్యోగాలు త‌క్కువే కావ‌చ్చ‌ని.. కానీ దాని ద్వారా పెద్ద ఎకో సిస్ట‌మ్ త‌యార‌వుతుంద‌ని.. అనేక వేరే కంపెనీలు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముందుకు వ‌స్తాయ‌ని ఆయ‌న చెప్పారు. 

ఐతే గూగుల్ డేటా సెంట‌ర్, ఏఐ హ‌బ్ విశాఖ‌కు రావ‌డంలో కూట‌మి ప్ర‌భుత్వ ఘ‌న‌తేమీ లేదని.. ఆ క్రెడిట్ అంతా త‌మ‌దే అని మాత్రం ఆయ‌న‌న్నారు. వైసీపీ సోష‌ల్ మీడియా కూడా ఇదే విష‌యాన్ని చెబుతూ వ‌చ్చినా.. ఆ స్టాండ్ మీద నిల‌వ‌కుండా, మ‌రోవైపు గూగుల్ డేటా సెంట‌ర్ వ‌ల్ల పైసా ప్ర‌యోజ‌నం లేద‌న్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. కానీ ఇప్పుడు జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌తో వాళ్ల గొంతుల్లో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డ్డ‌ట్ల‌యింది.

This post was last modified on October 24, 2025 10:10 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

13 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

36 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

45 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

1 hour ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago