హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘాల నాయకులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదంతో మొదలైన వివాదం చేయి చేయి కలిసే వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. తోసుకున్నారు. నెట్టుకున్నారు. దీంతో తీవ్రస్థాయిలో రచ్చ చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘర్షణ చోటు చేసుకున్నప్పుడు.. బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఆర్. కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కూడా అక్కడే ఉన్నారు. అయినప్పటికీ ఇరు పక్షాల నాయకులు ఆగకపోగా.. మరింత రెచ్చిపోయి దూషణలకు దిగారు. తోసుకున్నారు.
ఏం జరిగింది?
ఈ నెల 18న బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు, బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నేతృత్వం వహిస్తున్నారు. స్థానిక సంస్ఘల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నది ప్రధాన డిమాండ్. ఇప్పటికే పలు సంఘాలతో కలిసి ఈ విషయంపై చర్చించిన ఆర్. కృష్ణయ్య.. పలు సంఘాలను కలుపుకొని బీసీ జేఏసీగా ఏర్పడ్డారు. ఈ క్రమంలో ఇతర పార్టీలను కూడా కలుపుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు రామచందర్‌రావుతో చర్చించేందుకు బుధవారం సాయంత్రం ఆయన కార్యాలయానికి వచ్చారు.
బీసీలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పలు అంశాలపై ఆర్ . కృష్ణయ్య.. బీజేపీ చీఫ్‌కు వివరించారు. ఆయన కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. తాము కూడా బీసీలకు మద్దతు ఇస్తామని, మా ప్రధాని బీసీనేనని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో చర్చల అనంతరం.. ఇరువురు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు.. అటు బీజేపీ, ఇటుబీసీ సంఘాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయానికి వచ్చారు. రామచందర్‌రావు, కృష్ణయ్యలు మీడియా ముందుకు వస్తున్న సమయంలో రామచందర్‌రావును ‘జూనియర్’ అంటూ ఓ బీసీ నాయకుడు వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారం ముదిరి.. మాటల తూటాలు పేలాయి. ఎవరు జూనియర్ అంటూ.. బీజేపీ నాయకులు నిలదీశారు. అలాంటప్పుడు తమ ఆఫీసుకు ఎందుకు వచ్చారని నిలదీశారు. ఇలా.. ఇరు పక్షాలు మాటల దాడి చేసుకుంటున్న సమయంలోనే ఒకరు చేయి రువ్వారు. ఇది తీవ్ర గలాటాకు.. తోపులాటలకు.. కుర్చీలు విసురుకునే దాకా సాగింది. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న కృష్ణయ్య.. ఇరు పక్షాలను సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, ఎక్కడా ఎవరూ తగ్గకపోవడంతో మీడియా మీటింగును రద్దు చేసి.. కార్యాలయం నుంచి కార్యకర్తలను బయటకు పంపించారు.
This post was last modified on October 16, 2025 6:28 am
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…