దుబ్బాక ఉప ఎన్నికల విజయోత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రధాన పోటీదారుగా మారిన ఆ పార్టీ.. మెజారిటీ సీట్లు గెలిచేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతోంది. నిన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వచ్చి పార్టీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు.
ఇప్పుడు ఓ సంచలన నేతను జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం తురుపు ముక్క లాగా రంగంలోకి దింపుతోంది బీజేపీ. కర్ణాటకలో యూత్ నాయకుడిగా చాలా తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించి.. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారి.. మోడీ దృష్టిలో కూడా పడ్డ తేజస్వి సూర్య జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేయడానికి హైదరాబాద్ విచ్చేశాడు. మూడు పదుల వయసులోనే ఎంపీ అయిన తేజస్వి.. చాలా దూకుడుగా మాట్లాడి ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టడంలో దిట్ట.
ఎంపీ అయ్యాక మరింతగా పేరు సంపాదించిన తేజస్వికి హైదరాబాద్‌లో ఘన స్వాగతం కూడా లభించింది. జాతీయ నాయకుల రేంజిలో ఆయన్ని స్వాగతించింది భాజపా క్యాడర్. ఐతే అతడికి అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు దారులు మాత్రం వేరే రకమైన స్వాగతం చెబుతున్నారు. సోషల్ మీడియాలో తేజస్వి ఆగమనాన్ని వాళ్లు మరో రకంగా ట్రెండ్ చేస్తున్నారు. అతను హైదరాబాద్‌కు ఎందుకొస్తున్నాడు, వెనక్కి వెళ్లిపొమ్మంటూ ఒక బూతు మాటను జోడించి హ్యాష్ ట్యాగ్ పెడితే వేలల్లో ట్వీట్లు పడుతున్నాయి.
ఆ హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో టాప్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. తేజస్వి సొంత నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యల తాలూకు వీడియోలు బయటికి తీసి ముందు నీ నియోజకవర్గాన్ని బాగు చేసి తర్వాత హైదరాబాద్‌కు రా అంటూ తేజస్వికి కౌంట్లరు వేస్తూ పోస్టులు పెడుతున్నారు.
This post was last modified on November 23, 2020 5:55 pm
ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…
డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…
సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…