దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ వ్యక్తి ముఖ్యమంత్రి నివాసంలోనే ఆమెపై అత్యంత సమీపం నుంచి దాడి చేశాడు. దీంతో ఒక్కసారిగా ఢిల్లీలో అలజడి రేగింది. ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సీఎం రేఖా గుప్తా.. ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తాను ఊహించలేదన్నారు. సుదీర్ఘకాలంగా తాను రాజకీయాల్లో ఉన్నానని.. వ్యక్తిగత దాడలకు వ్యతిరేకమనిపేర్కొన్నారు. అయితే.. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు ముఖ్యమంత్రి నివాసం వద్ద భారీ సంఖ్యలో మోహరించారు. పరిసర ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి అరెస్టు..
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. ‘ప్రజలతో సీఎం’ పేరుతో రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తన నివాసంలోనే ప్రజలతో మమేకం అవుతున్నారు. వారి నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో ఆమె ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు దూరంగా ఉన్నారన్న పేరు వచ్చింది. సామాన్యుడి పార్టీ అంటూ.. ఆప్ పెట్టినా.. ఆయన పెద్దలకు మాత్రమే అందుబాటులో ఉన్నారని బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే రేఖా గుప్తా.. బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రజలకు చేరువగా ఉండే ముఖ్యమంత్రిని చూస్తారని చెప్పుకొచ్చారు. అలానే.. తాను సీఎం అయిన తదుపరి నెలలోనే ప్రజలతో ముఖ్యమంత్రి పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో బుధవారం ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునే సమయంలో ఓ వ్యక్తి ఫిర్యాదు ఇచ్చే నెపంతో ముఖ్యమంత్రికి అతి సమీపం నుంచి దాడి చేశారు. దీని నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నప్పటికీ.. ఘటన మాత్రం దిగ్భ్రాంతికి గురి చేసింది. కాగా.. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అయితే.. అతను దాడికి ఎందుకు ప్రయత్నించారన్న కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రికి మరింత భద్రత పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర బలగాలతో రేఖా గుప్తాకు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల భద్రత విషయం చర్చకు వచ్చింది. ఏపీ, తెలంగాణల ముఖ్యమంత్రులు తరచుగా ప్రజల మధ్యకు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ముఖ్యమంత్రులకు తగిన భద్రతను మరింత పెంచాల్సి ఉంది.
This post was last modified on August 20, 2025 10:17 am
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…