తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో గెలవాలని తెలుగుదేశంపార్టీ గట్టి పట్టుదలతో ఉన్నట్లే కనిపిస్తోంది. అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని ముందుగానే ప్రకటించేసిన చంద్రబాబునాయుడు తాజాగా మరో 97 మందితో జంబో టీంను కూడా నియమించేశారు. ఈ 97 మంది బృందంలో పార్టీ నేతలే ఉంటారు. మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, రాష్ట్ర కమిటి సభ్యులు మొత్తం మీద సీనియర్ నేతలనే చంద్రబాబు ఎంపిక చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంఎల్సీ బీద రవిచంద్రయాదవ్ తో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు.
నిజానికి తిరుపతి లోక్ సభ సీటులో టీడీపీ చాలా బలహీనంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే 1984లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. మళ్ళీ ఇప్పటి వరకు గెలుపన్నదే లేదు. కొన్నిసార్లు పొత్తుల్లో వదిలేసింది. మరికొన్ని సార్లు నేరుగా పోటీ చేసింది. ఎలా చేసినా పార్టీకి గెలుపు మాత్రం ఎండమావి లాగే తయారైంది. ఇక్కడ సమస్యంతా పార్టీలోనే ఉంది. ఎలాగంటే ప్రతి ఎన్నికకు ఓ అభ్యర్ధిని పోటీలోకి దింపటం ద్వారా పార్టీ నాయకత్వం ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం దారుణంగా విఫలమైంది.
తిరుపతి సీటు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఎస్సీల్లో గట్టి అభ్యర్ధిని రెడీ చేసుకోవటంలో ఫెయిలైందనే చెప్పాలి. 2009 ఎన్నికల్లో కృష్ణా జిల్లాకు చెందిన వర్ల రామయ్యను పోటీలోకి దింపింది. నిజానికి వర్లకు నియోజకవర్గానికి ఏమీ సంబంధం లేదు. అయినా తిరుపతి పరిధిలో ఎవరు లేనట్లు విజయవాడలో ఉండే వర్లను ఎందుకు పోటీ చేయించాల్సొచ్చిందో చంద్రబాబుకే తెలియాలి. ఇక 2014లో పొత్తులో భాగంగా బీజూపీకి సీటును వదిలేసింది. ఇక 2019 ఎన్నికల్లో పనబాక లక్ష్మిని పోటీ చేయించారు. ఈమె 2.28 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్ళీ ఇపుడు పనబాకనే రెండోసారి పోటీలోకి దింపారు.
తొందరలో జరగబోయే ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్ధి గెలుపు దాదాపు ఖాయమనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. సరే గెలుపోటములను పక్కన పెట్టేస్తే ఈ ఉపఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ చిత్తశుద్దితో ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తోంది. చంద్రబాబులోని మరో ప్రధాన లోపం ఏమిటంటే అభ్యర్ధిని చివరి నిముషం వరకు ప్రకటించరు. ఇక నామినేషన్ కు ఒకటి రెండు రోజులు మాత్రమే గడువుందంటే అప్పుడు అభ్యర్ధిని ప్రకటిస్తారు. దీంతో పోటీ చేయాలని అనుకునే వాళ్ళలో బాగా విసుగొచ్చేస్తుంది.
అయితే తన సహజత్వానికి భిన్నంగా దాదాపు నాలుగైదు నెలల ముందే అభ్యర్ధిని ప్రకటించేశారు చంద్రబాబు. అంటే తెలంగాణాలోని దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అనుసరించిన ఫార్ములాను చంద్రబాబు కాపీ కొట్టినట్లే ఉంది. సరే విషయం ఏదైనా అభ్యర్ధిని ముందే ప్రకటించటం, గెలుపుకోసం నియోజకవర్గంలో కమిటిలు వేయటం, బాధ్యతలు అప్పగించటం, సీనియర్ నేతలను లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాంపు వేయించటం లాంటివి మంచి ఫలితాలు ఇస్తాయనే అనుకోవాలి. చూద్దాం అంతిమ ఫలితం ఎలాగుంటుందో.
This post was last modified on %s = human-readable time difference 8:10 pm
పెళ్లి చూపులుతో దర్శకుడిగా పరిచయమై ఈ నగరానికి ఏమైంది ద్వారా యూత్ లో ట్రెండీ ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు తరుణ్…
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…
తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం…
తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేసి… రాష్ట్రం సాధించిన పార్టీగా గుర్తింపు పొంది… అనంతరం భారత…
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…