తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది. తన సహజ స్వభావానికి విరుద్ధంగా చంద్రబాబునాయుడు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటించేశారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేతలతో జూమ్ కాన్ఫరెన్సులో మాట్లాడినపుడు పనబాక లక్ష్మీనే అభ్యర్ధిగా ప్రకటించేశారు. చంద్రబాబు చేసిన అభ్యర్ధి ప్రకటనతో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అభ్యర్ధిని చంద్రబాబు ప్రకటిస్తారని నేతలెవరు ఊహించలేదు కాబట్టే.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా నామినేషన్ల వేయటానికి చివరి రోజు వచ్చేంతవరకు అభ్యర్ధిని ప్రకటించే అలవాటు లేదు చంద్రబాబుకు. అలాంటిది మిగిలిన పార్టీలకన్నా ముందే అభ్యర్ధిని ప్రకటించేయటంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి పెరిగిపోయింది. ఇప్పటివరకు తిరుపతిలో బీజేపీ నేతల హడావుడి మాత్రమే జరుగుతోంది. అభ్యర్ధిని ప్రకటించకపోయినా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవదర్ అండ్ కో మాత్రం రెగ్యులర్ గా తిరుపతిలో పర్యటిస్తు హీట్ పంచేస్తున్నారు. అలాంటిది చంద్రబాబు టీడీపీ అభ్యర్ధిని ప్రకటించేయటంతో ఇటు బీజేపీ అటు టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయినట్లయ్యింది.
ఇక మిగిలింది అధికార వైసీపీ మాత్రమే. నిజానికి వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గా ప్రసాదరావు మరణంతోనే ఇప్పుడు ఉపఎన్నికలు అవసరమయ్యాయి. మరి వైసీపీ తరపున బల్లి కుటుంబసభ్యులనే పోటీ చేయిస్తారా ? లేకపోతే బయట నేతలను ఎంపిక చేస్తారా ? అనే విషయం సస్పెన్సుగా మిగిలిపోయింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధి విషయంలో జగన్మోహన్ రెడ్డికి పూర్తి సమాచారం ఉండటంతో నేతలు పెద్దగా ప్రయత్నాలు చేసుకోవటం లేదు.
సరే అభ్యర్ధి ఎవరనేది తేలకపోయినా బీజేపీ తరపున ప్రచారం మాత్రం మొదలైపోయింది. బీజేపీనే పోటీ చేస్తుందని ఇప్పటికే వీర్రాజు ప్రకటించేశారు కాబట్టి జనసేన తరపున అభ్యర్ధి ఉండరనే అందరు అనుకుంటున్నారు. మరి బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్ధి ఎవరంటే మాత్రం ఎవరు చెప్పలేకున్నారు. అందుకనే అభ్యర్ధిని విడిచిపెట్టేసి పార్టీ కే ఓట్లేయమని పార్టీ నేతలు తిరుపతిలో ప్రచారం మొదలుపెట్టేశారట. మార్చిలోగా జరిగే ఉపఎన్నికలకు ఇప్పుడే హీట్ పెరిగిపోయింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఇంకెంత హీట్ పెరిగిపోతుందో చూద్దాం.
This post was last modified on November 18, 2020 2:36 pm
తెలంగాణ ఏర్పాటై తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశాక కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్.…
కొద్దిరోజుల క్రితం చెన్నైలో జరిగిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య తండ్రి శివకుమార్ మాట్లాడుతూ కోలీవుడ్…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత కనిపించకుండా పోయిన అనుష్క శెట్టి అనుకున్న ప్రకారం అన్నీ జరిగి…
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీఎం…
రాష్ట్రంలో ప్రభుత్వానికి సలహాదారులు అవసరం. అప్పుడు వైసీపీకి అయినా.. ఇప్పుడు కూటమి ప్రబుత్వానికి అయినా సలహాదారులు కావాల్సిందే. అసలు కేంద్ర…
అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం యూట్యూబ్.. సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా అధ్యక్షుడు…