Political News

ఏపీలో ఎన్నికలపై తేల్చేసిన నిమ్మగడ్డ

మార్చిలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు గట్టి ప్రయత్నమే చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు. కానీ కరోనా అప్పుడు జనాలను భయకంపితుల్ని చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా ఎన్నికలను వాయిదా వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. దీనిపై వైకాపా నాయకులు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో.. తదనంతరం నిమ్మగడ్డకు, ప్రభుత్వానికి ఎలా యుద్ధం నడిచిందో తెలిసిందే.

కాగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సన్నాహాలు చేస్తుంటే.. ప్రభుత్వం అడ్డు పడుతోంది. కానీ ఆయనేమీ తగ్గట్లేదు. వివిధ అంశాల్లో ప్రభుత్వంపై కోర్టులో స్పష్టమైన పైచేయి సాధించిన నిమ్మగడ్డ.. తాజాగా ఏపీలో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆలోచన చేస్తున్నట్లు ఈ ప్రకటనలో వెల్లడించారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని, రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కూడా తగ్గుముఖం పట్టిందని.. రోజుకు నమోదయ్యే కేసుల సంఖ్య 10వేల నుంచి 753కి తగ్గిందని.. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులు లేనందున వాటిని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రమేష్ కుమార్ పేర్కొన్నారు.

తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదలైన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని.. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు కోడ్‌ అమల్లోకి వస్తుందని.. ఎన్నికల కోసం ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ ఎన్నికలు.. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకూ దోహదపడతాయన్న ఎన్నికల కమిషనర్.. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని.. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

This post was last modified on November 17, 2020 5:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

22 minutes ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

2 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

3 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

3 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

4 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

6 hours ago