Political News

ప్ర‌శాంతి రెడ్డి.. మూట‌లు అందిస్తున్నారు: పేర్ని మరో వివాదం

వైసీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత పేర్ని నాని మ‌రోసారి తీవ్ర వివాదానికి తెర‌దీశారు. నెల్లూరు జిల్లా కోవూ రు ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కురాలు వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డిపై పేర్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. జిల్లా లో మైనింగ్ కార్య‌క్ర‌మాలు అన్నీ కూడా ఆమె క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతున్నాయ‌ని.. ఆమె మూట‌లు అంది స్తున్నార‌ని.. అవి తీసుకుంటున్న కొంద‌రు మంత్రులు ఆమెపై ఈగ‌వాల కుండా చూసుకుంటున్నార‌ని ఆరోపించారు. మీకు మూట‌లు అందిస్తోంది కాబ‌ట్టి.. ఆమె మీకు మ‌హాత‌ల్లి అని ఎద్దేవా చేశారు.

మంత్రి, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే కొల్లు ర‌వీంద్ర తాజాగా మాట్లాడుతూ.. వైసీపీ నాయ‌కురాలు, కృష్ణాజిల్లా జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ఉప్పాల హారిక‌పై విమ‌ర్శ‌లు చేశారు. “పోలీసులను తిట్టి.. టీడీపీ నాయ‌కుల‌ను తిట్టి.. ఎదురు త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. హారిక మొస‌లి క‌న్నీరు కారుస్తున్నారు. ఆమెను మించిన మ‌హాన‌టి మ‌రొక‌రు లేరు” అని కొల్లు వ్యాఖ్యానించారు. దీనికి కౌంట‌ర్ గా పేర్ని మాట్లాడుతూ.. ప్ర‌శాంతి రెడ్డి వ్య‌వ‌హారాన్ని తెర‌మీదికి తెచ్చారు. ఆమె ఎమ్మెల్యే హోదాను అడ్డు పెట్టుకుని జిల్లా మొత్తాన్ని ఆక్ర‌మించుకున్నార‌ని ఆరోపించారు.

మైనింగ్ చేస్తూ.. దానిలో వ‌చ్చిన లాభాల్లో కొంత మూట‌లు మీరు అందిస్తున్నారు కాబ‌ట్టి.. ప్ర‌శాంతి మీకు మ‌హాత‌ల్లిగా క‌నిపిస్తోంద‌ని పేర్ని విమ‌ర్శించారు. అంతా రాసుకుంటున్నామ‌ని చెప్పిన ఆయ‌న‌.. అధికా రంలోకి వ‌చ్చాక‌.. ఏం చేయాలో అది చేస్తామ‌ని చెప్పారు. పోలీసుల‌పై కూడా పేర్ని తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తు న్నారు. మంత్రులు చెప్పార‌ని త‌మ‌పై కి వ‌చ్చి కేసులు పెడితే.. న్యాయ‌స్థానాల‌కు ఈడుస్తామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు.

రాష్ట్రంలో రెడ్‌బుక్ పాల‌న సాగుతోంద‌న్న పేర్ని.. ఉప్పాల హారిక‌, ఆమె భ‌ర్త రాముల‌ను తిట్టి.. చివ‌రికి వారి పైనే కేసులు పెట్టార‌ని ఆరోపించారు. అయితే.. ఇంత‌కు ఇంత భ‌విష్య‌త్తులో తీర్చుకోవాల్సి ఉంటుంద న్నారు. మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ను ప‌గ‌టి వేష‌గాడితో పోల్చిన పేర్ని.. ఈ ప్ర‌భుత్వం, మంత్రులు, నాయ‌కులు అంద‌రూ మీడియాపై ఆధార‌ప‌డి బ్ర‌తుకుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

This post was last modified on July 14, 2025 6:41 pm

Share
Show comments
Published by
Satya
Tags: Perni Nani

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

1 hour ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago