ఒకరేమో యావత్తు ప్రపంచానికి కింగ్ ఫిషర్ బీర్లను పంపిణీ చేస్తున్న యునైటెడ్ బ్రూవరీస్ యజమాని విజయ్ మాల్యా. మరొకరేమో క్రికెట్ ను ఎలా వ్యాపార వస్తువుగా మార్చాలో చూపించి… అదే సమయంలో దేశంలో అందిన కాడికి దోచి విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ లలిత్ మోదీ. లలిత్ మోదీ మాదిరే మాల్యా కూడా భారత దేశ బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలను ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన వ్యక్తే. వీరిద్దరూ కలిసి ఇప్పుడు లండన్ లో జరిగిన ఓ పార్టీలో ఓ రేంజిలో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోను వేరే ఎవరో పోస్ట్ చేయలేదు. మాల్యాతో కలిసి ఎంజాయ్ చేసిన లలిత్ మోదీనే ఈ వీడియోను స్వయంగా తన చేజేతులారా.. తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం గమనార్హం.ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పార్టీ లండన్ లోని లలిత్ ఇంటిలోనే జరిగిందట. అప్పుల్లో కూరుకుపోయో, లేదంటే… అనుకున్నంత మేర డబ్బును పోగేసుకున్నాడో తెలియదు గానీ… లలిత్ మోదీ ఓ శుభ సందర్బాన్ని చూసుకుని ఎస్కేప్ అయ్యారు. ఆ తర్వాత పలు దేశాలు తిరిగిన ఆయన చివరకు లండన్ చేరినట్టు సమాచారం.
ఈ వీడియోలో లలిత్ మోదీ ఓ మైకు చేతబట్టుకుని పెద్ద స్వరంతో పాటలు పాడుతూ సాగారు. మోదీని చూడగానే… ఆయన వద్దకు పరుగులు పెట్టుకుంటూ వచ్చిన మాల్యాను ఆప్యాయంగా పలకరించిన మోదీ… మాల్యా భుజంపై చేసి మరింత ఎంజాయ్ మెంట్ లోకి వెళ్లిపోయారు. ఇక మాల్యా అయితే ఓ చేతిలో మద్యం గ్లాసు, మరో చేతిలో మైకు పట్టుకుని కనిపించారు. ఈ వీడియోను చూసిన భారతీయులంతా మాల్యా, మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on July 4, 2025 6:30 pm
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…