రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడం కష్టం. గతంలో చంద్రబాబు సర్కారు ఏపీలో పాలన సాగిస్తున్న సమయంలో రంగంలోకి దిగిన జనసేన నాయకుడు పవన్.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపించడం మానేసి.. ప్రతిపక్షంగా ఉన్న వైసీపీపైనా.. ఆ పార్టీ అధినేత జగన్ పైనా విరుచుకుపడ్డారు. అప్పట్లో అందరూ దీనిని చిత్రంగా చర్చించుకున్నారు. వ్యూహం ఏమిటనేది ఇప్పటికీ చాలా మందికి అంతుపట్టదు! కట్ చేస్తే.. ఇప్పుడు బీజేపీ కూడా ఇదే వ్యూహంతో ముందుకు సాగుతోంది. అధికారంలో ఉన్న జగన్‌ను వదిలేసి.. వైసీపీ నేతలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న వ్యతిరేకతను టార్గెట్ చేయడం మానేసి.. టీడీపీపై పడింది.
ఎప్పుడో పూర్వకాలం నాటి .. విమర్శలకే ఇంకా పదును పెడుతూ.. వాటితోనే ప్రజలను తమవైపు తిప్పుకొ నేందుకు ప్రయత్నిస్తుండడం సర్వత్రా నవ్వులు కురిపిస్తోంది. దివంగత ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపో టు పొడిచారంటూ.. తాజాగా బీజేపీ జాతీయస్థాయి నాయకుడు దేవ్‌ధర్ విమర్శించారు. నిజానికి ఇది తుప్పు పట్టిన విమర్శ. పైగా చంద్రబాబు ఇప్పుడు పదవిలో కూడా లేరు. అయినా .. ఆయన్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? అధికారంలో ఉన్న జగన్‌పై ఎందుకు పన్నెత్తు మాట అనడం లేదు..? అనే ప్రశ్నలు సహజంగానే తెరమీదికి వస్తాయి. దీనికి ప్రధాన కారణాలు కూడా కనిపిస్తుండడం గమనార్హం.
ఎందుకంటే.. జగన్‌ను విమర్శించాల్సి వస్తే.. ప్రధానంగా మూడు రాజధానుల విషయాన్ని తలతిక్క నిర్ణయంగా పేర్కొనాలి. అదే సమయంలో పోలవరం కట్టలేక పోతున్నాడు.. అసమర్ధ పాలకుడు.. అనైనా విమర్శించాలి. కానీ.. ఇలాంటి విమర్శలు చేసే సాహసం.. ఇప్పుడు బీజేపీ చేయలేదు. ఎందుకంటే.. అవి ఆగిపోవడానికి.. రాజధాని నిలిచిపోవడానికి పరోక్షంగా బీజేపీ కారణంగా ఉంది.
మూడు రాజధానుల నిర్ణయంపై కేంద్ర హోం శాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఏ క్యాపిటల్
అంటే.. ఒకటనే కాదు.. అనే అద్భుతమైన వివరణ ఇచ్చింది. అదే సమయంలో కర్నూలులో హైకోర్టు ప్రతిపాదనను తెచ్చిందే తామని బీజేపీ నేతలు ఇప్పటికీ చెప్పుకొంటున్నారు.
సో..అత్యంతకీలకమైన రాజధానిపై జగన్‌ను విమర్శించే పరిస్థితిలేదు. ఒకవేళ విమర్శించినా.. మీరు నిధులు ఇవ్వడం లేదు కనుక మేం రాజధాని కట్టలేక పోతున్నామంటూ.. వైసీపీ ఎదురు దాడి చేసినా.. చేయొచ్చు. ఇక, పోలవరంపైనా బీజేపీ మౌనం వహిస్తోంది. నిజానికి ఇప్పుడు పోలవరం సబ్జెక్టును తీసుకుని ప్రజల్లోకి వెళ్తే.. బీజేపీకి మంచి మార్కులు పడతాయి.
అటు సీమ, ఇటు కోస్తా ప్రాంతాలను తడిపే ఈ ప్రాజెక్టు ఎత్తు తగ్గిపోవడం.. సహా.. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంత ప్రాధాన్యం ఉన్నా.. బీజేపీ దీనిపై జోక్యం చేసుకోవడం లేదు. ఈ విషయంలోనూ జగన్‌ను ఏమీ అనలేదు.
ఎందుకంటే.. ఇది నిలిచిపోవడానికి .. ఎత్తు తగ్గిపోవడానికి బీజేపీ సర్కారే కారణమని వైసీపీ నుంచి ఎదుర య్యే దాడులు.. బీజేపీని మరింత ఇరకాటంలోకి నెట్టడం ఖాయం. ఇక, మిగిలింది.. దేవాలయాలపై దాడు లు. దీనినే పట్టుకుని వేలాడుతున్నా.. ఇది కూడా ప్రజలు పెద్దగా రిసీవ్ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు.
ప్రజలు ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు నుంచి కోరుకుంటున్నవాటిలో ప్రత్యేక హోదా కీలకంగా ఉంది. అదే సమయంలో అమరావతిపై నిర్నయం, పోలవరం ప్రాజెక్టు దూకుడు.. ఈ మూడు విషయాలను వదిలేసిన బీజేపీ.. కేవలం చంద్రబాబుపై విమర్శలతో పుంజుకోవాలని చూడడం అంటే.. కర్ర వదిలి సాము చేయడమే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 14, 2020 3:20 pm
కెరీర్ ఎప్పుడో మొదలైనా, ఎన్నో హిట్లు చూసినా వంద కోట్ల క్లబ్ అందని ద్రాక్షగా నిలిచిన నాగచైతన్యకు అది తండేల్…
దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన అజరామరమైన పాత్రల్లో తెనాలి రామకృష్ణ చాలా ముఖ్యమైంది. ఎన్టీఆర్ అంతటి దిగ్గజం శ్రీకృష్ణ…
వాలెంటైన్ వీక్ సందర్భంగా ఎక్కడ చూసినా ఎన్నో రకాల గులాబీలు.. వాటి సుగందాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. గులాబీ పువ్వు…
ఇప్పుడు సినిమాల్లో క్వాలిటీ కంటెంట్, భారీతనం, బిజినెస్, కలెక్షన్స్.. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్ మీద సౌత్ సినిమానే స్పష్టమైన…
ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర విన్నపం చేశారు. తరచుగా కేం ద్రంపై…
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల…