ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకు తలమానికంగా ఉన్న భారత్‌లో 1975, జూన్ 25న విధించిన అత్యవసర పరిస్థితి.. ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య వాదులు.. సమాజ ఉద్ధరణ సంఘాలు కూడా నాడు అనేక హింసలకు గురయ్యాయి. నాయకులను జైళ్లలో బందీలు చేశారు. అంతేకాదు.. ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ప్రత్యేకంగా జైళ్లను నిర్మించి మరీ.. ఖైదీలను అందులో పెట్టారు. ఇప్పటికీ.. ఇవి నాటికి గుర్తుగా ఉన్నాయి.
ఇవి అత్యంత ఇరుకైనా జైళ్లుగా కేంద్రం పేర్కొంది. అంటే.. కేవలం 4 అడుగుల ఎత్తులోనే బ్యారక్‌లు ఉంటాయి. అంతేకాదు.. ఒక్కరి మాత్రమే అవకాశం ఉండేలా వీటిని గదుగదులుగా నిర్మించారు. కనీసం.. మనిషి చేతులు చాపుకునే అవకాశం కూడా ఉండదు. అలాంటి జైళ్లను నిర్మించి.. వాటిలో రాజకీయ ఖైదీలను పెట్టారు. ఇదిలావుంటే.. అసలు ఎమర్జెన్సీలో అసాధారణ అకృత్యం మరొకటి జరిగింది. ఇదే.. దేశంలో ఎమర్జెన్సీని అంతమొందించేందుకు ప్రధాన కారణం కూడా అయింది.
నాటి ప్రధాని ఇందిరాగాంధీ ముద్దుల కుమారుడు సంజయ్ గాంధీ.. అప్పటికత అసాధారణ నాయకుడిగా రెచ్చిపోయారు. ఆయనకు ప్రభుత్వంలో ఎలాంటి భాగస్వామ్యం లేకపోయినా.. రాష్ట్రాలపై పెత్తనం చేశారు. ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయన తీసుకువచ్చిందే.. నిర్బంధం గర్భ విచ్ఛిత్తి కార్యక్రమం. అంటే.. గర్భిణులకు నిర్బంధంగా అబార్షన్లు చేయించడం. ఇది దేశవ్యాప్తంగా అమలైంది.
ఎవరూ గర్భం ధరించడానికి వీల్లేదని అనధికారిక ఉత్తర్వులు ఇచ్చారు. దీనిని దేశవ్యాప్తంగా అమలు చేశారు. మరీ ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్ ప్రాబల్య రాష్ట్రాల్లో దీనిని మరింత ఎక్కువగా అమలు చేశారు. వైద్యులను ఇంటింటికీ పంపించి.. మహిళల పొత్తికడుపులను పరీక్షించారు. ఎవరైనా గర్భంతో ఉన్నారని తెలిస్తే.. ఆ వెంటనే వారిని బలవంతంగా ఆసుపత్రులకు తరలించి.. గర్భవిచ్ఛిత్తి చేశారు. ఈ పరిణామం మహిళల ఆగ్రహానికి దారి తీసింది. ఈ క్రమంలోనే దేశంలో 1975-77 మధ్య జనాభా రేటు తగ్గిపోయింది. అనంతర కాలంలో రాజకీయాలకు అతీతంగా.. దేశవ్యాప్తంగా మహిళలు ఇందిరమ్మకు ద్వేషించే పరిస్థితి వచ్చింది. ఇది ఎమర్జెన్సీని తొలగించే వరకు దాదాపు ఏడాది పాటు కొనసాగింది. వాస్తవ ఎమర్జెన్సీ 21 నెలలు సాగింది.
This post was last modified on June 25, 2025 5:46 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…