అధికార వైసీపీ తాడికొండ ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవి తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. రెడ్డి సామాజికవవర్గంలోని వాళ్ళను ఎంఎల్ఏ కించపరుస్తు వ్యాఖ్యలు చేసినట్లుగా ఓ ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంఎల్ఏగా గెలిచన దగ్గర నుండి శ్రీదేవి ఏదో ఓ వివాదంలో ఇరుక్కొంటునే ఉన్నారు. మొదట్లో ఎంఎల్ఏ అసలు ఎస్సీనే కాదనే వివాదం మొదలైంది. తర్వాత ఎస్సీ ఎంఎల్ఏగా ఉండి అంబేద్కర్ ను కించపరుస్తు మాట్లాడారనే వివాదం రేగింది.
ఆ తర్వాత బాపట్ల ఎంపి నందిగం సురేష్ తో విభేదాలు బయటపడ్డాయి. ఎంపితో విభేదాలే చాలా కాలం నడిచాయి. ఈమధ్య పార్టీలోనే ఒకపుడు తనకు అనుచరులుగా ఉన్న సందీప్ తో పాటు మరో వ్యక్తితో విభేదాలు బయటపడ్డాయి. వాళ్ళ మధ్య వివాదం తాలూకు ఆడియో టేపులు కూడా బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత నియోజకివర్గంలో పేకాట క్లబ్బులను నడిపాలని ఎంఎల్ఏ చెప్పినట్లుగా ఉన్న మరో ఆడియో టేపును సందీపే రిలీజ్ చేశాడు. దాంతో ఇటు ఎంఎల్ఏ అటు సందీప్ అండ్ కో ప్రాణహాని ఉందంటు ఒకళ్ళపై మరొకరు కేసులు పెట్టుకునే దాకా వెళ్ళింది వ్యవహారం.
ఈ వివాదం ఇంకా సద్దుమణగక మునుపే మరో వివాదంలో ఇరుక్కున్నారు ఎంఎల్ఏ. ఏదో సమావేశంలో రెడ్డి సామాజికవర్గాన్ని కించపరుస్తు శ్రీదేవి మాట్లాడినట్లు ఆడియో టేపుల్లో ఉంది. అందులో రెడ్లు అనే వాళ్ళు చాలా డేంజర్ అని ఎంఎల్ఏ వ్యాఖ్యానించినట్లుంది. వాళ్ళవసరాలకు వాడుకుని మనల్ని వదిలేస్తారంటూ ఎంఎల్ఏ చెప్పినట్లుంది. స్ధానిక నేతలతో తనకున్న విభేదాలను కూడా సందీప్ తో ప్రస్తావించినట్లుగా ఆడియోలో వినబడుతోంది.
ఎంఎల్ఏది ప్రచారంలో ఉన్న సంభాషణల్లో పార్టీలోని ప్రముఖుల్లో ఎంఎల్ఏ జోగి రమేష్, ఎంపి అయోధ్య రామిరెడ్డి, కోన రఘుపతి, మాజీ ఎంఎల్ఏ లేళ్ళ అప్పిరెడ్డితో పాటు మరికొందరు పేర్లుకూడా ఉండటంతో ఆడియో టేపులు సంచలనంగా మారింది. పదే పదే ఇదే ఎంఎల్ఏ ఎందుకు వివాదాల్లో ఇరుక్కుంటున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు.
This post was last modified on November 12, 2020 3:59 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…