జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి గురువారానికి సరిగ్గా ఏడాది దాటిపోతోంది. మొన్నటిదాకా సినీ నటుడిగా, ఓ రాజకీయ పార్టీ అదినేతగానే కొనసాగిన పవన్ ఏడాది క్రితం డిప్యూటీ సీఎం అనే కొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారు. డిప్యూటీ సీఎం హోదాలో వపన్… గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక రంగాల శాఖలను ఏరికోరి మరి ఎంపిక చేసుకున్నారు. అంతేకాదండోయ్.. ఈ శాఖలపై ఆయన అనతి కాలంలోనే సమగ్ర పట్టు సాధించేశారు కూడా.
ఆది నుంచి పవన్ కల్యాణ్ అంటే ఓపెన్ టాప్ జీపు మాదిరే. ఏ విషయంలోనూ సీక్రెసీని మెయింటైన్ చేయని పవన్… డిప్యూటీ సీఎం హోదాలోనూ అలాగే సాగారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ లో గతంలో ఏ మంత్రి చేయని కార్యక్రమాలు చేపట్టిన పవన్… ఏపీ ప్రజలతో ప్రశంసలు అందుకున్నారు. పల్లె పండుగ పేరిట పవన్ ప్రారంభించిన ప్రోగ్రాం విశేషంగా ఆకట్టుకుంది. మినీ గోకులాలు పవన్ లోని నిబద్ధతను మరింతగా చాటింది. ఇక పంట కుంటలు, పశువులకు నీటి తొట్టెలు వంటి కార్యక్రమాలతో పవన్ తనదైన శైలి .పనితీను చూపెట్టారు. గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం పవన్ ప్రతిష్ఠను ఎక్కడికో చేర్చేసింది.
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నిలిపివేసిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని మరింత కాలం పాటు పొడిగించేలా ప్రథాని నరేంద్ర మోదీని ఒప్పంచిన పవన్… ఏపీకి మెజారిటీ నిధులను తీసుకువచ్చారు. ఈ పనితోనే డిప్యూటీ సీఎంగా సత్తా చాటిన పవన్… ఆ తర్వాత పల్లె సీమల్లో వెలుగులు నింపుతూ సాగారు. ఇక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హోదాలో పవన్ అటవీ భూములను ఆక్రమించిన దురాక్రమణ దారుల వెన్నులో వణుకు పుట్టించారు. సాక్షాత్తు వైసీపీ అదినేత జగన్ కు చెందిన సరస్వతి పవర్ భూముల్లోనూ అటవీ భూములను గుర్తించిన పవన్.. వాటిని ప్రభుత్వానికి స్వాధీనం చేశారు.
ఇక వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దురాక్రమించిన అటవీ భూములనూ గుర్తించిన పవన్.. వాటిపై కేసులు నమోదు చేయించారు. ఈ వ్యవహారం ఇఫ్పుడు కోర్టులో నడుస్తోంది. అదే సమయంలో వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం ఆక్రమించిన అటవీ భూములపైనా చర్యలు తీసుకున్నారు. మొత్తంగా అటవీ భూముల వైపు చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా పవన్ చేశారని చెప్పక తప్పదు. ఇక డిప్యూటీ సీఎంగానే కాకుండా వ్యక్తిగతంగానూ పవన్ చాలా కార్యక్రమాలే చేపట్టారు. పవన్ చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఇలా ప్రజామోదం పొందిందనే చెప్పాలి. తన ప్రోగ్రెస్ ను తానే బయటపెట్టుకున్న పవన్.. భవిష్యత్తులో మరింత పారదర్శకంగా, మరింత బాధ్యతగా విధులు నిర్వర్తిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
This post was last modified on June 20, 2025 1:53 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…