అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఏపీలో కలకలమే రేపింది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలో ఈ ఘటన జరగడంతో దీనికి మరింత ప్రాధాన్యం లభించింది. ఈ వీడియోలు వైరల్ కాగా… సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. తాజాగా మంగళవారం సాయంత్రం బాధిత మహిళ శిరీషతో ఆయన ఫోన్ లో పమార్శించారు. అంతేకాకుండా రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన బాబు.. ఆమె పిల్లల చదువులకు కూడా హామీ ఇచ్చారు. దీంతో బాధిత మహిళకు పూర్తిగా సాంత్వన లభించినట్టైంది.
కుప్పం మండలం నారాయణాపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష దంపతులు అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద కొంతకాలం క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత అప్పు తీర్చడం సాధ్యం కాక తిమ్మరాయప్ప తన కుటుంబాన్ని వదిలి పారిపోయాడు. ఆ తర్వాత శిరీష తన కుమారుడితో కలిసి బెంగళూరు వెళ్లి తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ దినసరి కూలీగా జీవనం సాగిస్తోంది. అయితే కుమారుడి స్టడీ సర్టిఫికెట్ అవసరమై ఆమె కుమారుడితో కలిసి గ్రామానికి రాగా… మునికన్నప్ప, ఆయన కుటుంబ సభ్యులు ఆమెను చెట్టుకు కట్టేసి హింసించారు. ఈ విషయం వైరల్ కాగా.. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన బాబు… నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
స్వయంగా సీఎం ఆదేశాలు జారీ చేయడంతో శిరీషను ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు నిందితుడు మునికన్నప్ప కుటుంబంపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇక రోజువారీ బిజీ షెడ్యూల్ నుంచి కాస్తంత బయటపడ్డ బాబు… మంగళవారం సాయంత్రం శిరీషకు నేరుగా ఫోన్ చేశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, భరపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచించారు. గతంలో నిందితుల నుంచి ఎప్పుడైనా ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయా? అని బాబు ప్రశ్నించగా.. చాలా సందర్భాల్లో వారు తనను ఇబ్బంది పెట్టారని ఆమె సమాధానం ఇచ్చారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదన్న బాబు…నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.
This post was last modified on June 17, 2025 9:08 pm
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…