వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నానిని ఇప్పుడు కేసులు చుట్టుముట్టేశాయని చెప్పక తప్పదు. ఇప్పటికే నాని ఫ్యామిలీపై రేషన్ బియ్యం మాయం కేసుతో పాటు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా అధికారంలో ఉండగా… టీడీపీ కార్యకర్తలపై నాని పెట్టించిన కేసులో తానే అడ్డంగా బుక్కై ఏకంగా అరెస్టు వారెంటు దాకా పరిస్థితిని తెచ్చుకున్నారు. కోర్టు వాయిదాలకు హాజరు కాని కారణంగా పేర్నిపై అరెస్టు వారెంటు జారీ చేస్తూ మచిలీపట్నం కోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే… 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే పేర్నికి జగన్ కేబినెట్ లో కీలక శాఖల మంత్రి పదవి దక్కింది. ఈ క్రమంలో అదే ఏడాది మచిలీపట్నానికి చెందిన టీడీపీ కార్యకర్తలు చందు, శ్రీహర్షలపై నాని కేసు పెట్టించారు. ఈ కేసు మచిలీపట్నం కోర్టులో విచారణకు రాగా… ఈ కేసులో నాని సాక్షిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణ ఎప్పుడు జరిగినా… కోర్టుకు హాజరయ్యే విషయాన్ని నాని అస్సలు పట్టించుకోలేదు. వెరసి ఐదేళ్ల పాటు ఆయన ఈ కేసును పట్టించుకోలేదు. దీంతో సోమవారం ఈ కేసు విచారణకు రాగా… ఒక్క వాయిదాకు కూడా హాజరు కాని నానిపై కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. ఇందులో నానికి ఊరటనిచ్చే అంశమేమిటంటే… ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి వాయిదా పడటమే.
2019లో వైసీపీ అదికారంలోకి రాగానే… తన భార్య పేరిట ఓ భారీ గోదామును నిర్మించిన నాని… దానిని సివిల్ సప్లైస్ కు అద్దెకు ఇచ్చారు. అయితే ఈ గోదాములో నుంచి భారీ సంఖ్యలో రేషన్ బియ్యం బస్తాలు మాయమైనట్లుగా కూటమి సర్కారు రాగానే బయటపడిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగానే… నాని తన భార్య, కుమారుడితో కలిసి పరారయ్యారు. కోర్టు నుంచి అరెస్టు కాకుండా రక్షణ పొందిన తర్వాతే ఆయన ఫ్యామిలీతో సహా అజ్ఞాతం వీడారు. అయినా కూడా ఈ కేసులో నానికి చిక్కులు తప్పవన్న వాదన అయితే బలంగానే వినిపిస్తూనే ఉంది. ఎందుకంటే… ఆరోపణలు రాగానే.. బియ్యం మాయమైన మాట వాస్తవమేనని ఒప్పుకున్న నాని ఆ బియ్యానికి సరిపడ సొమ్మును ప్రభుత్వానికి చెల్లించేశారు.
ఇక సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు తనకు బదులుగా తన కుమారుడు పేర్ని కిట్టును బరిలోకి దించిన నాని.. కుమారుడిని గెలిపించుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని అడ్డదార్లనూ వినియోగించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో నకిలీ ఇళ్ల పట్టాలను సృష్టించి కుమారుడితో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ వ్యవహారం మొన్నటి వల్లభనేని వంశీ నకిలీ పట్టాల కేసు సందర్భంగా అధికారులు వెలుగులోకి తీశారు. దీనిపైనా నాని, కిట్టులపై కేసు నమోదు కాగా… తండ్రీకొడుకులు ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇలా కేసు నమోదు కాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్న నానిని, ఆయన ఫ్యామిలీని మరిన్ని కేసులు చుట్టుముట్టే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నాని అరెస్టు కూడా ఖాయమేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on June 16, 2025 9:02 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…