సీఎం చంద్రబాబు మార్కు పాలన ఇక నుంచి ప్రారంభం అవుతుందా? ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇక నుంచి ఆయనలో 1995ల నాటి ముఖ్యమంత్రి చూడడం ఖాయమా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది ప్రభుత్వ వర్గాల నుంచి!. సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పినట్టు.. ఆయన ఇక నుంచి 1995ల నాటి ముఖ్యమంత్రిగా మారనున్నారు. దీంతో పాలన పరుగులు పెట్టడమే కాకుండా.. అధికారులను.. ఉద్యోగులను కూడా కాలంతో పాటు పరుగులు పెట్టించనున్నారు.
1995లలో సీఎంగా చంద్రబాబు.. పరుగులు పెట్టారు. “నేను నిద్ర పోను-మిమ్మల్ని నిద్ర పోనివ్వను” అంటూ.. ఆయన ఉద్యోగులను, ప్రభుత్వ శాఖలను కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంచారు. హైదరాబాద్‌ను రీబిల్డ్ చేశారు. డ్రాక్వా సంఘాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. బీసీలకు అవకాశం కల్పించారు. రాష్ట్రానికి ఆదాయం పెంచేలా వ్యవహరించారు. అంతర్జాతీయ స్థాయి నాయకులను కూడా హైదరాబాద్ కు తీసుకువచ్చారు. రికార్డులు సాధించారు. ఇలా.. ఆయన పాలన అప్పట్లో పరుగులు పెట్టింది.
ఇప్పుడు కూడా గత ఏడాది కాలంలో దాదాపు ఇదే తరహా పాలన సాగింది. అయితే.. ఎక్కడో ఒకింత అసంతృప్తి అయితే కనిపిస్తోంది. అధికారులు మాట వినడం లేదని.. పనులు చేయడం లేదని.. ఏకంగా మంత్రుల నుంచే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు మరోసారి 1995ల నాటి సీఎంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిని ఈ ఏడాది ముహూర్తం పెట్టుకున్నారు. దీనికి కూడా కారణం ఉంది. ఇప్పట్లో ఎన్నికలు లేవు. సో.. ఎవరికి కోపం వచ్చినా.. చేయగలిగింది లేదు.
దీంతో ఒకరి కోపతాపాలతో పనిలేకుండా.. పనిచేసుకుంటూ పోతే.. ఎన్నికలకు ముందు ఏడాది కొంత మార్పు చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి.. ఈ ఏడాది మాత్రం స్పీడ్ పెంచి.. పనులు ముందుకు తీసు కువెళ్లేందుకు ప్రయత్నించనున్నారు. ఆకస్మిక తనిఖీలు.. అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి, బనక చర్లను పట్టాలెక్కించడం..యువతకు ఉపాధికల్పించడం.. సమాజంలోని అట్టడుగు వర్గాలను పీ-4 ద్వారా పైకి తీసుకురావడం.. అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందించేందుకు ఈ ఏడాది చంద్రబాబు స్వీయ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. సో.. ఈ పరిణామాలను గమనిస్తే.. చంద్రబాబు లో 1995సీఎంను ఖచ్చితంగా చూడొచ్చు.
This post was last modified on June 12, 2025 9:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…