పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు తాజాగా మొదలైన నిధుల వివాదం కారణంగా జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారా ? పార్టీ నేతల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు విషయంలో రూ. 47615 కోట్లతో సవరించిన అంచనాలకు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు కేంద్ర జలశక్తి శాఖ కూడా ఆమోదం తెలిపింది. అయితే తాజాగా ఆర్ధికశాఖ మొకాలడ్డింది. 2014లో ఆమోదించిన అంచనాల ప్రకారం రూ. 20 వేల కోట్లే ఇస్తామని చెప్పేసింది. ఈ అంశమే ఇపుడు ఏపిలో హాట్ టాపిక్ అయిపోయింది.
పోలవరంకు నిధులిచ్చే విషయంలో కేంద్రం తాజా వైఖరికి చంద్రబాబునాయుడు ప్రభుత్వమే కారణమని వైసీపీ సర్కార్ మండిపోతోంది. ఇదే సమయంలో తమ హయాంలో రూ. 55 వేల కోట్లకు ఆమోదం తెలిపిన కేంద్రప్రభుత్వం ఇపుడు మాటమార్చటం వెనుక జగన్ చేతకాని తనమే ఉందంటూ టీడీపీ నేతలు ఎదురుదాడులు మొదలుపెట్టారు. ఇందులో ఏది నిజం ? ఏది అబద్ధం ? అనేది ఇప్పుడిప్పుడే తేలేది కాదు. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాల్లో ఎవరిది తప్పన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే ఇద్దరి నిస్సహాయతను కేంద్రప్రభుత్వం అడ్వాంటేజ్ తీసుకుంటోందన్నది మాత్రం వాస్తవం.
సరే దీనిపై ఎంత చర్చలు జరిపినా ఉపయోగం లేదన్నది కూడా తేలిపోయింది. ఈ విషయాన్ని జగన్ గ్రహించారట. కాకపోతే కేంద్రం నుండి నిధులు రాబట్టాలనే ఉద్దేశ్యంతోనే ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖ రాశారు. అపాయిట్మెంట్ ఇస్తే వెంటనే నిధుల విషయం కోసమే ఢిల్లీ వెళ్ళి మోడి కలవటానికి జగన్ రెడీగా ఉన్నారు. సరే ఒకవేళ కేంద్రం అంగీకరించకోతే పరిస్దితి ఏమిటి ? ఇక్కడే జగన్ ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారట. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఫండింగ్ చేసే ప్రపంచబ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకుతో పాటు మరికొన్ని ఆర్ధిక సంస్దల విషయాన్ని కూడా జగన్ ఆర్ధిక సలహాదారులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
ఎంతలేదన్నా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే తక్కువలో తక్కువ రూ. 30 వేల కోట్లు అవసరం. ఇంత పెద్ద మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వమే పెట్టుకునేంత సీన్ లేదు. అందుకనే ఇతర మార్గాలపై ఆధారపడక తప్పటం లేదు. ఇందులో భాగంగానే ప్రపంచబ్యాంకు, ఏషియా బ్యంకుతో పాటు చైనాలోని ఆర్ధిక సంస్ధలు, జపాన్ కోఆపరేటివ్ బ్యాంక్ లాంటి వాటితో చర్చలు జరపటానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే విదేశాల నుండి ఫండింగ్ తెచ్చుకుంటే కేంద్రం అనుమతి అవసరం.
రాష్ట్రప్రభుత్వం తీసుకునే అప్పులను తీర్చే విషయంలో కేంద్రం కౌంటర్ గ్యారెంటీ ఇవ్వాల్సుంటుంది. నేరుగా కేంద్రమే నిధులివ్వలేనపుడు అప్పులు తెచ్చుకునేందుకు కౌంటర్ గ్యారెంటీ అన్నా ఇవ్వమని కేంద్రాన్ని అడగాలని రాష్ట్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే రాష్ట్రప్రభుత్వం అడిగినట్లు కౌంటర్ గ్యారెంటీకి రెడి అయితే ఇక పోలవరం నిధుల సమస్య కేంద్రానికి వదిలిపోతుంది. కాబట్టి కౌంటర్ గ్యారెంటీ ఇచ్చే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. మరి కేంద్రం ఏమంటుందో చూడాల్సిందే.
This post was last modified on November 8, 2020 3:00 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…