Political News

ఏపీపై మోదీకి ఇంత ప్రేమా?.. పులకించిన పవన్!

ఏపీలో అధికార కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఓ రేంజి సహాయం అందుతోంది. అడిగిన వాటితో పాటు అడగని వాటికి కూడా కేంద్రం ఏపీలోని ప్రాజెక్టులకు ఇతోదికంగా నిధులు విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం… ఏపీలోని బద్వేల్, నెల్లూరుల మధ్య రహదారిని 4 లేన్ రహదారిగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ అదికారికంగా ప్రకటించగా… ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఈ రోడ్డు మంజూరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఆయన తెలుగులో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ సందేశాన్ని చూసిన జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పులకించి పోయారని చెప్పక తప్పదు.

వాస్తవానికి ఇప్పటిదాకా ప్రధాన మంత్రులుగా పనిచేసిన వారిలో మెజారిటీ మంది నేతలు ఉత్తరాదిపైనే ప్రత్యేక దృష్టి సారించేవారు. ఒకరిద్దరు ప్రధానులు మినహా దక్షిణాది రాష్ట్రాలను అందులోనూ తెలుగు రాష్ట్రాలను పట్టించుకున్నవారే లేరంటే కూడా అతిశయోక్తి కాదు. ప్రధాని మోదీ మాత్రం ఏపీ పట్ల. ఏపీ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. పీఎంగా హ్యాట్రిక్ కొట్టిన వెంటనే ఆయన రాజధాని అమరావతికి వెన్నుదన్నుగా నిలిచారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకు, హడ్కోలతో రుణాలు ఇప్పించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టే దిశగా ప్రోత్సహిస్తున్నారు. వెరసి గతంలో ఎన్నడూ లేనంతమేర కేంద్రం నుంచి ఏపీకి సహాయ సహకారాలు లభిస్తున్నాయి. 

సీఎం చంద్రబాబు ఏది అడిగినా కూడా మోదీ కాదనడం లేదు. అదే సమయంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అడిగినా కూడా మోదీ కాదనడం లేదు. వెరసి ఏపీకి కేంద్రం నుంచి నిధుల వరద పారుతోంది. తన సొంత రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్రలకు కూడా మోదీ పెద్ద ఎత్తున నిదులు మంజూరు చేస్తున్నా… ఎందుకనో గానీ ఏపీకి దేనిని కేటాయించినా దానిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మోదీ సాగుతున్నారు. తాజాగా బద్వేల్. నెల్లూరుల మధ్య 4 లేన్ రహదారిని మంజూరు చేసిన మోదీ దానిని సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. తొలుత ఆంగ్లంలో పోస్టును పెట్టిన మోదీ… ఆ తర్వాత మరోమారు సదరు పోస్టును తెలుగులోనూ పోస్ట్ చేసి ఏపీపై తనకున్న ప్రేమ ఏపాటిదో చాటుకున్నారు.

బద్వేల్, నెల్లూరుల మధ్య 4 లేన్ రహదారిని మంజూరు చేస్తున్నట్లుగా ప్రధాని మోదీ పెట్టిన పోస్టును చూసిన పవన్ కల్యాణ్ నిజంగానే పులకించిపోయారు. ఆ వెంటనే ఆయన మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తాను ఓ పోస్టు పెట్టారు. ఈ రహదారి మంజూరు చేసిన ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కూడా పవన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ రహదారిని నాలుగు వరుసల రహదారిగా మారితే… కృష్ణపట్నం పోర్టుకు ఏకంగా 33.9 కిలో మీటర్ల దూరం తగ్గుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ రహదారి ఏపీ పురోభివృద్దిలో కీలక భూమిక పోషించనుందని కూడా పవన్ అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ రహదారిపై అటు మోదీ, ఇటు మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ వరుస పోస్టులు పెట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

This post was last modified on May 29, 2025 7:46 am

Share
Show comments
Published by
Satya
Tags: PM Modi

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

29 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago