వైసీపీ అధినేత జగన్.. కూటమి సర్కారుపై ఒత్తిడి తెచ్చే క్రమంలో జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు రెడీ అయిన విషయం తెలిసిందే. ‘వెన్నుపోటు’ పేరుతో జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయడంతోపాటు.. కలెక్టరేట్లలో వినతి పత్రాలు కూడా ఇచ్చేందుకు ఆయన రెడీ అయ్యారు. రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా.. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నది జగన్ నిరసనల తాలూకు అజెండా.
అయితే.. అదే రోజు.. కూటమి ప్రభుత్వం కూడా.. రెండు కార్యక్రమాలను ప్రకటించేందుకు రెడీ అయింది. దీనిలో ప్రధానంగా కూటమి పార్టీలు విజయం దక్కించుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. పార్టీల తరఫున పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇది పార్టీల తరఫున చేపట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారికంగా కూడా అదే రోజు.. “రాష్ట్రానికి విముక్తి” పేరుతో మరో కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా రెడీ అయినట్టు తెలిసింది.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలైన.. టీడీపీ, బీజేపీ, జనసేనలు విజయం దక్కించుకున్నాయి. దీనిలో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి.. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విజయం దక్కించుకుంది. ఇక, రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి రెండూ గెలుచుకుంది. ఈ సందర్బానికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ తరఫున గ్రామ గ్రామాన కార్యక్రమాలు, అన్నదానం కూడా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. తొలిసారి 134 స్థానాల్లో విజయం దక్కించుకుంది. ఇది కూడా టీడీపీ పరంగా చూసుకుంటే రికార్డే. దీనిని పురస్కరించుకుని పార్టీ తరఫున కార్యక్రమాలు చేపడతారు. అదేవిధంగా ప్రభుత్వం మారి.. ఏడాది అవుతుంది కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా.. కార్యక్రమాలను నిర్వహించను న్నట్టు తెలిసింది. ఇవన్నీ. . కూడా వైసీపీ నిర్వహించే వెన్నుపోటు కార్యక్రమానికి కౌంటర్‌గానే నిర్వహి స్తున్నామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే క్లారిటీ రానుంది. ఈ రెండు పార్టీలు ఇలా వ్యూహాత్మకంగా కార్యక్రమాలు నిర్వహిస్తే.. వైసీపీ నిర్వహించే వెన్నుపోటు ఏమేరకు సక్సెస్ అవుతుందన్నది ప్రశ్నార్థకమే.
This post was last modified on May 26, 2025 3:42 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…