Political News

రాష్ట్ర వ్యాప్తంగా కూట‌మి దూకుడు.. ఇక‌, వైసీపీకి క‌ష్ట‌మే..!

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా రాష్ట్రంలో దాదాపు అన్ని మునిసిపాలిటీల‌ను కూట‌మి ప్ర‌భుత్వం కైవ‌సం చేసుకునే దిశ‌గా అడుగులు వేసింది. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు స్థానిక సంస్థ‌లు కూట‌మి ప‌రం అయ్యాయి. కీల‌క‌మైన తిరుప‌తిని కూడా హ‌స్త‌గ‌తం చేసుకున్న కూట‌మి.. చీరాల‌, విశాఖ‌, క‌దిరి, తిరువూరు, గుంటూరు వంటి చోట్ల కూడా.. పాగా వేస్తోంది. ఇప్ప‌టికే కొన్ని సొంతం చేసుకుంది. ఇక, విజ‌య‌వాడ‌లో మాత్రం క‌ద‌లిక కొంత త‌గ్గింది.

కూట‌మి నాయ‌కుల మ‌ధ్య క‌లివిడి లేక‌పోవ‌డం.. కీల‌క‌మైన విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం బీజేపీ నాయ‌కుడు ఉన్న నేప‌థ్యంలో విజ‌య‌వాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌ను ద‌క్కించుకునే విష‌యంలో కూట మి నాయ‌కులు ఇంకా దృష్టి పెట్ట‌లేదు. కానీ, బ‌లంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం కూట‌మి ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతున్నాయి. స్థానికంలో జెండా ఎగరేస్తున్నారు. విజ‌య‌వాడ‌పై కూడా.. దృష్టి పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు.

మ‌రోవైపు.. విశాఖప‌ట్నం గ్రేట‌ర్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌ను కూడా ఇటీవ‌ల ద‌క్కించుకున్నారు. డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక విష‌యం మాత్ర‌మే వాయిదా ప‌డింది. ఇది మిన‌హా మిగిలిన చోట్ల మాత్రం కూట‌మి దాదాపు దున్నేసింద‌నే చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో వైసీపీ మ‌రింత కుదేల‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. స్థానికంగా ప‌ట్టు కోల్పోతే.. వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని ముందుకు తీసుకువెళ్లే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే.. దీనిపై జ‌గ‌న్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

ప్ర‌జ‌ల్లో తిరుగుబాటు వ‌స్తుంద‌ని.. ఇప్పుడు ప‌ద‌వులు కోల్పోయిన వారు పార్టీ కోసం ప‌నిచేస్తార‌ని ఆయ‌న ఊహాగానాల్లో ఉన్నారు. కానీ, మార్కాపురం వంటి మునిసిపాలిటీల్లో పార్టీ త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భావించిన చైర్మ‌న్ చంద్ర ఏకంగా పార్టీ మారారు. త్వ‌ర‌లోనే ఆయ‌న జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ సాగుతోంది. ఎలా చూసుకున్నా.. వైసీపీ అనుస‌రిస్తున్న వైఖ‌రి మాత్రం పార్టీని మ‌రింత దిగ‌జారేలా చేస్తోంద‌ని అంటున్నారు.

This post was last modified on May 21, 2025 11:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

44 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago