Political News

‘ఆపరేషన్ సిందూర్’.. ఈ పేరే ఎందుకు పెట్టారంటే?

భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఈ దాడులు నిర్వహించబడ్డాయి. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది ప్రధాన స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. బహవల్పూర్, మురిడ్కే, సియాల్‌కోట్ వంటి ప్రాంతాలపై గగనతల, భూభాగం నుంచి సమన్విత దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్ లో 90మందికి పైగా ఉగ్ర వాదులు హతమయ్యారని తెలుస్తోంది.

ఈ ఆపరేషన్ పేరు వెనుక ప్రత్యేక అర్థం ఉంది. సాధారణంగా ‘సిందూర్’ అంటే భారతీయ సంప్రదాయంలో వివాహిత మహిళలు ధరించే గుర్తు. కానీ ఈ సందర్భంలో, పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన దారుణ దాడిని గుర్తు చేసేలా, అర్థభరితంగా ఈ ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని పేరు పెట్టారు. ఆ దాడిలో ఉగ్రవాదులు మతం ఆధారంగా పౌరులను హతమార్చిన విషయం తెలిసిందే.

భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ ద్వారా పహల్గామ్‌లో హతమైన అమాయకులకు ఒక విధమైన న్యాయం జరగిందని చూపించాలనుకుంది. ‘సిందూర్’ అనే పదం హిందు మహిళల రక్షణకు, గౌరవానికి ఒక చిహ్నంలా కూడా పనిచేస్తుంది. దానికి తగ్గట్టే, మరణించిన వారికి నివాళి అర్పించే విధంగా ఈ చర్య భారత గౌరవాన్ని నిలబెట్టే సంకేతంగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ దాడులను పర్యవేక్షించారని భద్రతా వర్గాలు వెల్లడించాయి. పాక్ సైనిక స్థావరాల్ని కాకుండా, కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలపైనే దాడులు జరపడం ద్వారా భారత్ తర్కబద్ధంగా వ్యవహరించిందని అధికారులు తెలిపారు. ఈ చర్య తర్వాత సరిహద్దుల వద్ద ఉద్రిక్తత మరింత పెరగడంతో, అంతర్జాతీయ దృష్టి ఈ పరిణామాలపై కేంద్రీకృతమవుతోంది.

This post was last modified on May 7, 2025 11:48 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago