Political News

క‌ర్ణుడి చావు.. వైసీపీ ఓట‌మి.. రెండూ ఒక్క‌టే: బొత్స‌

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లుచేశారు. వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్ప‌టికి 11 మాసాలు పూర్త‌యినా.. ఇంకా త‌ప్పులు వెతుకుతూనే ఉన్నామ‌ని ఆయ‌న చెప్పారు. ఇదేస‌మయంలో ఆయ‌న.. మ‌హాభార‌తంలోని క‌ర్ణుడి చావును వైసీపీ ఓట‌మికి లింకు పెట్టారు. “క‌ర్ణుడి చావుకు 100 కార‌ణాలు ఉన్న‌ట్టే.. వైసీపీ ఓడిపోవ‌డానికి కూడా వంద కార‌ణాలు ఉన్నాయి. ఏం చెప్పమంటారు?” అని మీడియాను ఎదురు ప్ర‌శ్నించారు. క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన ప్ర‌చారం చేసుకోలేకపోవ‌డం వ‌ల్ల తాము ఇచ్చిన ప‌థ‌కాలు ప్ర‌చారంలోకి రాలేక‌పోయాయ‌ని చెప్పారు.

అదేస‌మయంలో టీడీపీ అనుకూల మీడియా చేసిన వ్య‌తిరేక‌ ప్ర‌చారం కూడా వైసీపీ ఓట‌మికి కార‌ణంగా మారింద‌ని బొత్స తెలిపారు. అయితే.. ప‌ర్టిక్యుల‌ర్‌గా ఇదీ కార‌ణం అని చెప్ప‌డానికి త‌మ ద‌గ్గ‌ర ఏమీ కార‌ణాలు క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు. నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌న్న మాట కేవ‌లం క‌ల్పిత‌మేన‌న్నారు. “కూర్చున్న కొమ్మ‌నున‌రుక్కుంటామ‌ని ఎలా అంటారు? అలా కాదు.. మ‌రేవో కార‌ణాలు ఉన్నాయి. మాపై వ్య‌తిరేక ప్ర‌చారం ఎక్కువ‌గా జ‌రిగింది. ” అని బొత్స వ్యాఖ్యానించారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కూట‌మి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌ర్షం బీభ‌త్సం సృష్టిస్తే.. రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం 24 గంట‌లు గ‌డిచిన త‌ర్వాత కూడా.. ఏమీ చేయ‌లేద‌న్నారు.

రాజ‌ధాని అమ‌రావ‌తికి మోడీ ఎందుకు వ‌చ్చారో.. ఆయ‌న‌కైనా తెలుసా? అని బొత్స అన్నారు. ఏడాది కాలంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేక పోయింద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ప‌థ‌కాలూ అంద‌డం లేద‌న్నారు. ఈ విష‌యం త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు కూడా చెప్పార‌ని.. ఇప్పుడు ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు. మ‌రోవైపు ల‌క్షా 50 వేల కోట్ల రూపాయ‌ల అప్పులు చేశార‌ని, ఆ సొమ్ములు ఏం చేశారో కూడా తెలియ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రానున్నార‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటార‌ని బొత్స తెలిపారు. త‌మ పార్టీలో ఎవ‌రు ఉన్నా.. జ‌గ‌న్ కోస‌మే ప‌నిచేస్తారని వ్యాఖ్యానించారు.

This post was last modified on May 6, 2025 9:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

59 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago