తెలుగు సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు.. అన్వేష్. ‘నా అన్వేషణ’ పేరుతో అతను ఎన్నో దేశాలు తిరుగుతూ ట్రావెల్ వీడియోలు చేస్తుంటాడు. యూట్యూబ్‌లో 24 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారతడికి. క్రేజీగా వీడియోలు చేస్తూ, బూతులు జోడించి దూకుడుగా కామెంట్రీ చెబుతూ ఫాలోవర్లను బాగానే పెంచుకున్నాడు అన్వేష్. ఈ మధ్య అతను బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసే వారి మీద యుద్ధం ప్రకటించి గట్టిగానే పోరాడుతున్నాడు. హర్ష సాయి సహా చాలామందిని ఎక్స్‌పోజ్ చేసి మంచి పేరే సంపాదించాడు. కానీ కొన్నిసార్లు అతడి మాటలు, ఆరోపణలు హద్దులు దాటిపోతుంటాయి.
ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి అతను యథాలాపంగా తీవ్ర ఆరోపణలే చేసేశాడు. హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ డీల్స్‌లో భాగంగా ఏకంగా రూ.300 కోట్ల స్కామ్ జరిగిందంటూ అన్వేష్ చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. తెలంగాణ డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి, మాజీ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి.. ఇలా చాలామంది మీద అతను ఆరోపణలు చేసేశాడు.
వీళ్లందరూ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలతో రూ.300 కోట్లు సంపాదించారని ఆరోపించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వ్యవహారం సీరియస్ అయిపోయింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ ఆరోపణల మీద ఫిర్యాదు చేశారు. దీంతో అన్వేష్ మీద కేసు నమోదైంది. అన్వేష్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఈ ఆరోపణల వీడియోలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లే కనిపిస్తోంది. దీంతో అన్వేష్‌ను ఇండియాకు రప్పించడమో.. లేక వచ్చినపుడు అరెస్ట్ చేయడమో తథ్యంగా కనిపిస్తోంది. తనపై కేసు నమోదైన నేపథ్యంలో అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
This post was last modified on May 4, 2025 7:59 pm
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…