Political News

అమరావతి 2.0 ఇన్విటేషన్ ఇదిగో!… కండీషన్స్ ఇవే!

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడింది. మే నెల 2న స్వయంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన చేతులతో అమరావతి పనులను పున:ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకున్న రాష్ట్రంలోని కూటమి సర్కారు.. మోదీ టూర్ కు భారీ ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి పరిధిలోని సచివాలయ భవనాల వెనుక బాగాన్ని ఈ కార్యక్రమ నిర్వహణ కోస ఎంపిక చేయగా…ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇటీవలి పెహల్ గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో అమరావతిలో మోదీ టూర్ కు గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను కల్పిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి దాదాపుగా 5 లక్షల మందిని తరలించే దిశగా కూటమి సర్కారు చర్యలు చేపట్టింది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు, వారి కుటుంబాలకు ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు ఆహ్వానాలు అందజేశారు. ఈ ఆహ్వానాలు ఉన్న వారిని మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఈ ఇన్విటేషన్ లేకుంటే… ఎట్టి పరిస్థితుల్లోనూ సభా ప్రాంగణంలో అడుగు పెట్టలేని దిశగా భద్రతా చర్యలు జరుగుతున్నాయి. ఈ ఇన్విటేషన్ కార్డును ఇతరులు వినియోగించడానికి కూడా వీల్లేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఇక సభకు వచ్చేవారు ఇన్విటేషన్ తో పాటు రావడంతో పాటు ఖాళీ చేతులతోనే సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టాలని కూడా సీఆర్డీఏ కండీషన్ పెట్టింది.

సభకు వచ్చే వారు మొబైల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు, బ్రీఫ్ కేసులు, కెమెరాలు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటర్ బాటిళ్లతో పాటు కార్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కు చెందిన పరికరాలను కూడా తీసుకు రావద్దని సీఆర్డీఏ అధికారులు కోరారు. ఈ మేరకు ఇన్విటేషన్ లోనే ఈ విషయాలను సీఆర్డీఏ విస్పష్టంగా ప్రకటించింది. ఈ నిషేదాజ్ఞలు అమలు అయ్యేలా సీఆర్డీఏ అధికారులు ఏ తరహా చర్యలు తీసుకుంటారోనన్న వాదన ఆసక్తి రేకెత్తిస్తోంది. మొబైల్ ఫోన్లు లేనిదే ఇంటి నుంచి బయట కాలు పెట్టలేని ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతిలో ప్రదాని సభకు మొబైళ్లు లేకుడా జనాన్ని ఎలా కట్టడి చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే అధికారుల వినతులు ప్రజల నుంచి కూడా సానుకూల స్పదనే వస్తోందని కూడా తెలుస్తోంది.

అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన దాదాపుగా గంటన్నర పాటు కొనసాగనుంది. పెహల్ గాం ఉగ్ర దాడి నేపథ్యంలో అమరావతిలో మోదీ కార్యక్రమ వేదికపైకి కూడా పరిమితంగానే నేతలను అనుమతించనున్నారు. మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ స్వాగత వాక్యాలతో ప్రారంభం కానున్నఈ కార్యక్రమం..చంద్రబాబు ప్రసంగం, ఆ తర్వాత మోదీ స్పీచ్ లతో ముగియనుంది. అంతకుముందే…అమరావతి పనుల పున:ప్రారంభానికి మోదీ శ్రీకారం చుట్టనున్నారు. మొత్తంగా పెహల్ గాం ఉగ్రదాడి నేపథ్యంలో అమరావతిలో మోదీ టూర్ పై పలు ఆంక్షలు అమలు  చేయక తప్పని పరిస్థితి నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on April 30, 2025 6:22 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

37 minutes ago

ఓజి… వరప్రసాద్… పెద్ది?

మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…

1 hour ago

షాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం…

2 hours ago

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

3 hours ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

4 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

5 hours ago