Political News

వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా ?

ఏమిటో కమలనాధుల మాటలు కోటలు దాటుతున్నట్లే అనిపిస్తోంది. విశాఖపట్నంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పటంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. వీర్రాజు, పార్టీ రాజ్యసభ ఎంపి జీవిఎల్ నరసింహారావు మాటలు విన్నతర్వాత కమలనాధులు తమను తాము ఎంత ఎక్కువగా ఊహించుకుంటున్నారో అర్ధమైపోయింది. బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశంపార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని ధైర్యంగా చెప్పలేకపోతోంది. అలాంటిది అన్నీ నియోజకవర్గాల్లోను పోటీ చేయటానికి కనీసం గట్టి అభ్యర్ధులను కూడా దింపేస్ధితిలో లేని పార్టీ ఏకంగా అధికారంలోకి వచ్చేస్తామని చెప్పటమే విచిత్రంగా ఉంది.

వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఒకేసారి ఇటు వైసీపీ అటు టీడీపీ పై మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లే ఉంది. అదేమంటే వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి రాబోయేదని పదే పదే చెబుతున్నారు. వీర్రాజు మరచిపోయిందేమంటే మైండ్ గేమ్ ఆడటంలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు ఇద్దరు ఇద్దరే. నిజానికి వీళ్ళముందు వీర్రాజు సరితూగలేరు. అసలు పార్టీకున్న బలం ఏమిటో మిగిలిన వాళ్ళకన్నా వీర్రాజుకే బాగా తెలిసుండాలి. అందరికీ తెలిసిన బీజీపే బలం ఏమిటంటే పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే యంత్రాంగం కూడా లేదు. ఎందుకంటే అసలు పోటి చేయటానికి గట్టి అభ్యర్ధులే లేరు కాబట్టి.

మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 0.84. అంటే నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) కు వచ్చిన 3 శాతం ఓట్లకన్నా ఎంత తక్కువో అందరికీ అర్ధమైపోతోంది. వాస్తవంగా బీజేపికున్న బలం ఇదే. కాకపోతే ఎప్పుడైనా బలమైన గాలి వీచినపుడు, ఏదైనా బలమైన పార్టీతో పొత్త పెట్టుకున్నపుడు ఓ నాలుగు సీట్లలో గెలుస్తుందంతే. లేకపోతే కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేందు. మొన్నటి ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లలో బీజేపీ పోటీ చేయలేకపోయింది. పోటి చేసిన నేతల్లో ఏ ఒక్కళ్ళకూ డిపాజిట్ కూడా రాలేదు.

విభజన చట్టంలో చెప్పినట్లుగా కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వలేదనే మంట జనాల్లో బాగా ఉంది. దానికితోడు ఇపుడు పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలను కేంద్రం కావాలనే వివాదం చేస్తోంది. ప్రత్యేకహోదా మంటకు తోడు ఇపుడు పోలవరం ప్రాజెక్టు కూడా తోడైంది. రాష్ట్రాభివృద్దికి పదే పదే అడ్డుకుంటున్న కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రంలో జనాలు ఓట్లు ఎలా వేస్తారని వీర్రాజు అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు. మామూలుగానే పార్టీకంటూ ఓటు బేస్ లేదు. దానికి తోడు బలమైన వైసీపీ లాంటి పార్టీ అధికారంలో ఉంది. బలమైన క్యాడర్ ఉన్న టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. ఇలాంటపుడు బీజేపీని ఇంకెవరు పట్టించుకుంటారో చూడాల్సిందే.

This post was last modified on November 3, 2020 10:19 am

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago