ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు ఈ రోజు. అయితే.. భవిష్యత్తును స్వప్నించే చంద్రబాబు.. మరో పాతికేళ్ల తర్వాత.. ఎలా ఉంటారు? అంటే.. ఊహించలేం కానీ.. ఆయన వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు మాత్రంమరో పాతికేళ్ల తర్వాత ఏపీని సమూలంగా మార్చివేస్తాయని అంటున్నారు మేధావులు. చంద్రబాబు పేరు ఇప్పుడు కాదు.. అప్పుడు మార్మోగుతుందని చెబుతున్నారు.
రాజధాని అమరావతి నగరాన్ని ప్రపంచానికే తలమానికంగా తీర్చిదిద్దడంలో ఆయన చేస్తున్న కృషి… 25 ఏళ్ల తర్వాత.. చంద్రబాబు పేరును మరింత ద్విగుణీకృతం చేస్తుందని అంటున్నారు. ఐకానిక్ టవర్ల ని ర్మాణం ద్వారా.. దేశంలోనే ఇలాంటి టవర్లు ఉన్న తొలి రాష్ట్ర రాజధానిగా అమరావతి రూపు దిద్దుకోనుంది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న జనాభా రెట్టింపు అవుతుందని.. తద్వారా.. ఆదాయం కూడా పెరుగుతుందని అంటున్నారు.
ఇప్పుడు జనాభా పెంపుదలకు సంబంధించి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు ఫలిస్తే.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం వృద్ధి కూడా పెరగనున్నాయి. పాతికేళ్ల ప్రణాళికతో రూపొందిస్తున్న ప్రాజెక్టులు సఫలీ కృతం అయితే.. చంద్రబాబుపేరు సువర్ణాక్షరాలతో రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సదుపాయాలు వంటివి కూడా..చంద్రబాబును హైలెట్ చేయడం ఖాయమని అంటున్నారు.
నగరాల విషయానికి వస్తే.. విజయవాడ-తాడేపల్లి-గుంటూరు-మంగళగిరి ప్రాంతాలనుకలుపుతూ.. మహా నగరంగా తీర్చిదిద్దే క్రతువు పూర్తయితే.. ఇక, ఈ నగరాల ఔన్నత్యం పెరగడంతోపాటు.. ఏపీలోనే అతి పెద్ద నగరం ఏర్పాటు సాకారం అవుతుందని చెబుతున్నారు. విశాఖను ఐటీ నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు దీనిని సాకారం చేస్తే.. వచ్చే పాతికేళ్లలో సైబరాబాద్ ను మించి పోతుందన్న చర్చ కూడా ఉంది. సో.. చంద్రబాబు వేసిన బీజాలు.. మరో పాతికేళ్ల తర్వాత.. ఫలాలు అందించడం ఖాయమని మేధావులు చెబుతున్నారు.
This post was last modified on April 20, 2025 2:36 pm
నేచురల్ స్టార్ నాని నుంచి ‘హిట్-3’ లాంటి వయొలెంట్ ఫిలిం వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇందులో వయొలెన్స్ వేరే లెవెల్లో…
పాకిస్థాన్ తన వక్రబుద్దిని మరోసారి బయట పెట్టుకుంది. భారత్ దాడులకు భీతిల్లిన దాయాది దేశం.. అమెరికాతో మధ్యవర్తిత్వం చేయించుకుని.. కాల్పుల…
ఒక మామూలు మధ్యతరగతి వ్యక్తి సినిమాల్లోకి వెళ్తాం అని అంటే.. కంగారు పడేవాళ్లే కుటుంబ సభ్యులే ఎక్కువ. బ్యాగ్రౌండ్ లేకుండా…
ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శనివారం జరిగిన ఓ వివాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది.…
భారత్, పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన…
రీ రిలీజ్ ట్రెండ్ లో ఒకప్పటి వింటేజ్ సినిమాలను థియేటర్ లో అనుభూతి చెందాలనే ప్రేక్షకులు భారీగా ఉన్నారు. నిన్న…