Political News

ఆ ఇద్దరు ఓకే అంటే సాయిరెడ్డి సేఫేనా?

ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డిని ఇప్పుడు కేసులు చుట్టుముట్టేలానే ఉన్నాయని చెప్పక తప్పదు. ఓ వైపు కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ, మరోవైపు ఏపీ లిక్కర్ స్కాం.. ఇలా రెండు కీలక కేసులు సాయిరెడ్డిని నిద్ర పోనివ్వడం లేదు. ఇప్పటికే రెండు, మూడు సార్లు ఈ కేసుల్లో విచారణకు హాజరైన సాయిరెడ్డికి తాజాగా మరోమారు విచారణకు రావాలంటూ లిక్కర్ స్కాం విచారణ కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ విచారణకు అయితే సాయిరెడ్డి హాజరవుతారనే చెప్పాలి.

మరి ఈ కేసుల నుంచి ఆయనకు విముక్తి ఎప్పుడు? పొరపాటున రాజకీయాల్లోకి వచ్చానన్న భావనతో ఏదో వ్యవసాయం చేసుకుందామంటే ఈ కేసుల గోలేమిటబ్బా అని సాయిరెడ్డి మదనపడిపోతున్నారు. అదే సమయంలో ఈ కేసుల నుంచి విముక్తి పొందేందుకు ఓ మార్గాన్ని అయితే ఆయన ఎంచుకున్నారు గానీ… దానికి ఓ ఇద్దరు నేతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. వెరసి వారెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? తానెప్పుడు ఈ కేసుల నుంచి ఉపశమనం పొందుతాను అంటూ సాయిరెడ్డి ఎదురు చూస్తున్నారు. సాయిరెడ్డి ఎంచుకున్న మార్గం ఏమిటి? ఆయనకు అడ్డుపడుతున్న ఆ ఇద్దరు ఎవరన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, రాజకీయ సన్యాసం తర్వాత సాయిరెడ్డి సాగుతున్న తీరును బట్టి చూస్తే… త్వరలోనే సాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. వైసీపీకి, ఆ పార్టీ నుంచి తనకు దక్కిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి ముందే బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపి మరీ సాయిరెడ్డి ఈ అడుగు వేశారన్న వాదనలు లేకపోలేదు. అయితే సాయిరెడ్డిని బీజేపీలోకి చేర్చుకునే విషయంపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో పాటుగా బీజేపీ నేత, అనకాపల్లి ఎంపీగా కొనసాగుతున్న సీఎం రమేశ్ లు ససేమిరా అంటున్నారట. వారిద్దరి నుంచి సమ్మతి లేకుండా సాయిరెడ్డి బీజేపీలోకి చేరే ఛాన్సే లేదు. ఎందుకంటే… పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అద్యక్షురాలిగా ఉండగా… రమేశ్ కు అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది.

అయితే వీరిద్దరిని ఎలా ఒప్పంచాలన్న దిశగానూ సాయిరెడ్డి తనదైన శైలి వ్యూహాలు రచిస్తున్నట్లుగా సమాచారం. గతంలో టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీల్లో కొనసాగిన పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు నుంచి తన వ్యూహాన్ని అమలు చేసే దిశగా సాయిరెడ్డి సాగుతున్నారట. పురందేశ్వరితో సాయిరెడ్డికి పెద్దగా వైరమేమీ లేదనే చెప్పాలి. అంతేకాకుండా వెంకటేశ్వరరావుతో సాయిరెడ్డికి ఓ మోస్తరు స్నేహం కూడా ఉంది. ఇక కొంతకాలం క్రితం చనిపోయిన నందమూరి తారకరత్న సతీమణి తన బంధువు అయిన నేపథ్యంలో దగ్గుబాటితో బంధుత్వాన్ని ఆసరా చేసుకుని మరింత దగ్గరైతే పురందేశ్వరిని ఒప్పంచడం పెద్ద పనేమీ కాదని సాయిరెడ్డి భావిస్తున్నారట.

ఇక సీఎం రమేశ్ తో సాయిరెడ్డికి ప్రత్యక్షంగా శత్రుత్వమేమీ లేదు గానీ… సీఎం రమేశ్ పక్కా బిజినెస్ మ్యాన్. వ్యాపారంలో సక్సెస్ అయ్యాకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత టీడీపీలో ఉన్న రమేశ్… 2019లో బీజేపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. పార్టీ అధిష్ఠానం వద్ద మంచి గ్రిప్ ను కూడా సాదించారు. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు చెందిన వారైన రమేశ్… జగన్ తో సన్నిహితంగా మెలగిన సాయిరెడ్డితో కలిసి పనిచేసేందుకు ససేమిరా అంటున్నట్లుగా సమాచారం. రమేశ్ ను తన పట్ల మెత్తబరిచే కార్యాన్ని సాయిరెడ్డి బీజేపీ పెద్దలకే వదిలేసినట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన పురందేశ్వరి, రమేశ్ లు సరేననడమే ఆలస్యం సాయిరెడ్డి బీజేపీలో చేరిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

This post was last modified on April 16, 2025 6:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘చంద్ర‌బాబు గారి తాలూకా’.. ఇదో ర‌కం దందా!

గ‌త ఏడాది కూట‌మి విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. ముఖ్యంగా పిఠాపురంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌యం సాధించిన త‌ర్వాత‌.. 'పిఠాపురం…

32 minutes ago

ఫ్యాక్ట్ చెక్ : కుండ బద్దలు కొట్టిన ఇమాన్వి

పెహల్గామ్ ఉదంతం తర్వాత పాకిస్థాన్ మీద తీవ్ర చర్యలకు నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ప్రజల నుంచి కూడా…

46 minutes ago

జాతకం బాగుంటే జాక్ పాట్ కొట్టొచ్చు

బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిర్లిప్తత నెలకొంది. చాలా థియేటర్ల దగ్గర స్మశాన వైరాగ్యం కనిపిస్తోంది. పట్టుమని పది మంది రాక…

48 minutes ago

లోక‌ల్ టాక్‌: వైసీపీని వ‌దిలేద్దాం!

గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఘోరంగా ప‌రాజయం పాలైన వైసీపీని చాలా మంది వ‌దిలేశారు. కీలక రెడ్డి…

2 hours ago

లేటు వయసులో గ్రేటు రిస్కు

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు తెరను ఏలిన రాజశేఖర్ చాలా ఏళ్లుగా ట్రాక్ తప్పేశారు. తన సమకాలీకులైన సీనియర్…

2 hours ago

అమ‌రావ‌తి… జాతీయం- బాబు సూప‌ర్ స్కెచ్‌!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఊహిస్తున్న దానికి భిన్నంగా.. మ‌రింత డెవ‌ల‌ప్ చేసేందుకు సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి…

3 hours ago