తెలుగుదేశం పార్టీలోని అత్యంత సీనియర్ ఎంఎల్ఏల్లో బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. చాలా సంవత్సరాల తర్వాత చౌదరికి పార్టీలోని అత్యున్నత వేదికైన పాలిట్ బ్యూరోలో స్ధానం దక్కిన కారణంగా ఆయన హ్యాపీగానే ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీని పెట్టినపుడు వ్యాపార రంగం నుండి రాజకీయాల్లోకి చౌదరి ప్రవేశించారు. రాజమండ్రిలో 1983లో మొదటిసారి పోటి చేయగానే గెలిచారు. అప్పటి నుండి 1989లో తప్ప మిగిలిన అన్నీసార్లు పోటీ చేసి గెలుస్తునే ఉన్నారు. ఇప్పటికి బుచ్చయ్య ఆరుసార్లు గెలిచారు.
మొదటినుండి పార్టీకి స్ట్రాంగ్ లాయలిస్టుగా, సపోర్టర్ గా ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు మాత్రం ఎందుకనో కరుణ చూపలేదు. 1994లో మొదటిసారి ఎన్టీఆర్ మంత్రివర్గంలో పౌర సరఫరా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్ పదవి కోల్పోయినా ఎన్టీఆర్ తోనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన మరణంతో వేరే దారిలేక చివరకు మళ్ళీ చంద్రబాబు దగ్గరకే వచ్చారు.
సరే ఆయన అయితే చంద్రబాబుకు తన విధేయతను నిరూపించుకున్నా వివిధ కారణాల వల్ల చంద్రబాబు మాత్రం బుచ్చయ్యను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. తన తర్వాత పార్టీలోకి వచ్చిన ఎవరెవరినో మంత్రులుగా తీసుకున్నా బుచ్చయ్యను మాత్రం ఎందుకు మంత్రిగా తీసుకోలేదో ఎవరికీ తెలీదు. ఏదో పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు కానీ అదేమీ పెద్ద పదవి కాదని బుచ్చయ్యే అప్పుడప్పుడు అంటుండేవారు.
అలాంటిది 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే తనకు తప్పకుండా మంత్రివర్గంలో చోటుంటుందని బుచ్చయ్య అనుకున్నా నిరాశ తప్పలేదు. తర్వాత జరిగే విస్తరణలో ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారట. అయితే విస్తరణలో కూడా తనకు చోటు దక్కకపోవటంతో విపరీతంగా మండిపోయారు బుచ్చయ్య. చంద్రబాబు తీరుపై మీడియాతోనే తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. తర్వాత చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడినా గ్యాప్ అయితే అలాగే ఉండిపోయింది.
అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇపుడు బుచ్చయ్యను చంద్రబాబు పాలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. దాంతో తన సీనియారిటికి గుర్తింపు వచ్చినట్లుగా బుచ్చయ్య హ్యాపీగా ఫీలవుతున్నారంటూ నేతలు చెబుతున్నారు. ఆశించిన మంత్రిపదవి రాకపోయినా అత్యున్నత వేదికలో చోటు కల్పించటంతోనే తన సీనియారిటిని చంద్రబాబు గుర్తించినట్లు బుచ్చయ్య వ్యాఖ్యానించినట్లు నేతలంటున్నారు. చూడబోతే మంత్రిపదవి రాలేదన్న కోపం నుండి పాలిట్ బ్యూరోలో చోటు దక్కినందుకు హ్యాపీగానే ఉన్నారేమో.
This post was last modified on October 31, 2020 5:38 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…