హైపర్ మార్కెట్లు, మాల్స్, మల్టీప్లెక్స్ ల నిర్మాణం, నిర్వహణలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఏపీలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ఓ అంగీకారానికి వచ్చింది. ఏపీ వాణిజ్య రాజధాని విశాఖలో ఆ సంస్థ ఓ మాల్ సహా కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. విశాఖలో ఈ కంపెనీ దాదాపుగా రూ.1,500 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. ఇలాంటి తరుణంలో ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో పర్యటించారు. వీరికి సహకారం అందించిన సీఆర్డీఏ అధికారులు.. అమరావతిలోని పలు ప్రాంతాలను దగ్గరుండి మరీ చూపించారు. ఈ పర్యటన అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇప్పటికే విశాఖలో మాల్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు అంగీకరించిన లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ అమరావతిలోనూ పెట్టుబడులు పెట్టేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్లుగా సమాచారం. విశాఖలో పెట్టుబడుల కోసం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో లులూ గ్రూప్ సంస్థ అధినేత యూసుఫ్ అలీ… అమరావతి గురించి కూడా వాకబు చేసినట్లుగా తెలుస్తోంది. అమరావతి ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు చెప్పడంతో అక్కడ కూడా పెట్టుబడులు పెట్టేందుకు అలీ ఆసక్తి చూపారట. ఈ క్రమంలోనే ఓ సారి అమరావతిలో పర్యటించి అక్కడి స్థలాలు, వాతావరణం తదితరాలను పరిశీలించాలని చంద్రబాబు కోరారట. ఈ కారణంగానే లులూ గ్రూప్ ప్రతినిధి బృందం శుక్రవారం అమరావతిలో పర్యటించినట్లు సమాచారం.
అమరావతిలో పర్యటన సందర్భంగా భవిష్యత్తులో నగరం ఎలా ఉండబోతోంది?. ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు రానున్నాయి? నవ నగరాల రూపు రేఖలు ఎలా ఉంటాయి? జనాభా ఏ మేర పెరుగుతుంది? తదితర వివరాలను సీఆర్డీఏ అధికారుల ద్వారా తెలుసుకున్న లులూ బృందం అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందట. విశాఖలో మాదిరిగానే అమరావతిలోనూ ఓ హైపర్ మాల్, కన్వెన్షన్ సెంటర్, మల్టీప్లెక్స్, ఐమ్యాక్స్ తదితరాలను ఓ సమూహంగా ఏర్పాటు చేయాలని భావిస్తోందట. ఇందుకోసం విశాఖలో మాదిరిగానే అమరావతిలోనూ ఆ సంస్థ రూ.1,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ఒప్పందం కుదిరే అకాశాలున్నట్లు సమాచారం.
This post was last modified on April 5, 2025 11:24 am
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…