దేశంలోని మైనారిటీ ముస్లిం సోదరులంతా వద్దంటున్న వక్ఫ్ సవరణ చట్టం బుధవారం పార్లమెంటు ముందుకు వస్తోంది. ఈ సవరణ చట్టానికి పార్లమెంటులో ఆమోదం లభించడం లాంఛనమే. అధికార ఎన్డీఏ ప్రతిపాదిస్తున్న ఈ సవరణ చట్టానికి బ్రేకులు వేసేంత బలం విపక్షాలకు లేదు కాబట్టి…ఎలాగూ ఈ చట్టానికి ఎలాంటి అడ్డంకులు ఉండవనే చెప్పక తప్పదు. మరి ఈ చట్టంపై ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు తమదైన శైలి భావాలను ఆపాదించుకుంటూ సాగుతున్నాయి ఏ పార్టీ వాదన ఆ పార్టీ వినిపిస్తోంది. మరి అలాంటప్పుడు ఎవరి వాదన సరైనది అనే మాట కూడా ప్రస్తావించుకోవాలి కదా. ఈ సవరణ చట్టం విషయంలో ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ ఎం చేసిందన్న విషయంలోకి వెళ్లిపోదాం పదండి.
కేంద్రంలో అధికార ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యదిక సంఖ్యలో ఎంపీ సీట్లున్న పార్టీగా టీడీపీ కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. ఈ లెక్కన ఎన్డీఏ ప్రతిపాదించే ఏ బిల్లును అయినా ఆ పార్టీ వ్యతిరేకిస్తే… అసలు ఆ బిల్లు సభ ముందుకే వచ్చే పరిస్థితి లేదు. మరి వక్ఫ్ సవరణ చట్టాన్ని ఎన్డీఏ సభ ముందుకు తీసుకువచ్చిందంటే… దానికి టీడీపీ అనుమతి ఇచ్చినట్టే కదా. మరి ముస్లిం మైనారిటీల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పే టీడీపీ… ముస్లింలు వద్దంటున్న ఈ బిల్లుకు ఎలా అనుమతించింది? అంటే… బిల్లును క్షుణ్ణంగా పరిశీలించిన టీడీపీ… దానిలో ఓ నాలుగు మార్పులను ప్రతిపాదించింది. ఈ నాలుగు ప్రతిపాదనల్లో మూడింటికి బీజేపీ ఓకే చెప్పింది. ఓ ప్రతిపాదనకు మాత్రం ఒప్పుకోలేదు. సరే… ఎలాగూ మూడు ప్రతిపాదనలకు ఓకే అన్నారు కదా అన్న భావనతో టీడీపీ అడుగు ముందుకేసింది.
టీడీపీ ప్రతిపాదించిన మూడు మార్పులేమిటన్న విషయానికి వస్తే… వక్ఫ్ బై యూజర్ గా నమోదు అయిన ఆస్తుల పున:పరిశీలనకు అవకాశమే లేదని టీడీపీ ప్రతిపాదించింది. అంటే… ఒకసారి ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేసిన తర్వాత దానికి సంబంధిత పత్రాలు లేకున్నా కూడా దానిని వక్ఫ్ ఆస్తిగానే పరిగణిస్తారు. ఇక రెండో ప్రతిపాదన ఏంటంటే.. వక్ఫ్ ఆస్తుల నిర్ధారణలో జిల్లా కలెక్టర్ కు తుది అధికారం ఉండరాదని టీడీపీ చెప్పగా…దానికి బీజేపీ ఆమోదం తెలిపింది. ఆ మార్పునూ చట్టంలో చేర్చింది. ఇక టీడీపీ మూడో ప్రతిపాదనగా… డిజిటల్ పత్రాలను సమర్పించేందుకు ఆరు నెలల గడువు పొడిగించాలని కోరగా… అందుకు బీజేపీ సమ్మతించింది. ఇక వక్ఫ్ ఆస్తుల ముస్లిమేతరుల జోక్యాన్ని అనుమతించరాదని టీడీపీ కోరగా… దానికి మాత్రం బీజేపీ అంగీకరించలేదు.
ఇక ఈ సవరణ చట్టాన్ని ప్రతిపాదించినంతనే వైసీపీ తాను వ్యతిరేకమంటూ తన వైఖరిని చెప్పేసింది. వైసీపీ ఇప్పుడు ఏపీలోనే కాకుండా కేంద్రంలోనూ విపక్ష హోదాలో ఉన్నట్టే లెక్క. గతంలో అయితే బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు లేదు కాబట్టి నాడు కేంద్రంలో అదికారంలో ఉన్న ఎన్డీఏతో వైసీపీ చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. అయితే ఏపీలో తన రాజకీయ ప్రత్యర్థి టీడీపీ… ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది. ఏపీలోనూ ఆ రెండ పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి. వెరసి వైసీపీ విపక్షమనే చెప్పాలి. విపక్షంగా ఉన్న ఏ పార్టీ అయినా అదికార పక్షం తీసుకువచ్చే బిల్లులను అద్యయనం చేయాలి? దానికి మార్పులు ప్రతిపాదించాలి. అయితే ఈ రెండూ చేయని వైసీపీ… ఏదో విపక్షంలో ఉన్నాం కాబట్టి ఈ బిల్లును వ్యతిరేకించాల్సిందేనన్నట్లుగా వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పేసి చేతులు దులుపుకుంది.
This post was last modified on April 2, 2025 10:57 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…