ఏపీలో స్థానిక సంస్థలు వరుసబెట్టి కూటమి ఖాతాలోకి చేరిపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు మునిసిపల్ కార్పొరేషన్ లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గాలు వైసీపీ నుంచి టీడీపీకి మారాయి. తాజాగా రాష్ట్రంలోనే అతి పెద్దది అయిన గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)పై కూటమి జెండా ఎగిరేందుకు రంగం సిద్ధం అయిపోయింది. ఈ మేరకు ఇప్పటికే జీవీఎంసీ మేయర్ గా ఉన్న వైసీపీ నేత గొలగాని వెంకట కుమారిపై కూటమి పార్టీలకు చెందిన కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. ఈ తీర్మానంపై ఈ నెల 19న ఓటింగ్ జరిగేందుకు జీవీఎంసీ అధికార యంత్రాంగం కరసత్తు మొదలుపెట్టింది.
వైసీపీ అధికారంలో ఉండగా…స్థానిక సంస్థల ఎన్నికలు జరగగా…రెండు మునిసిపాలిటీలు మినహా అన్న పురపాలికలు వైసీపీ ఖాతాలో పడిపోయాయి. ఈ క్రమంలో జీవీఎంసీని కూడా వైసీపీనే చేజిక్కించుకుంది. అయితే మొన్నటి సార్వత్రిక జరిగిన తర్వాత వరుసబెట్టి పురపాలిక కార్పొరేటర్లు, కౌన్సలిర్లు కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. జీవీఎంసీలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జీవీఎంసీలో కూటమి పార్టీల బలం 72కు చేరగా… వైసీపీ బలం 34కు పడిపోయింది. ఇంకా వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు గేట్లు దూకేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అయితే తమ పార్టీ కార్పొరేటర్లు కట్లు దాటకుండా ఉండేలా వైసీపీ అధిష్ఠానం బెంగళూరులో క్యాంపును ఏర్పాటు చేసింది.
మరోవైపు కూటమి కూడా తన కార్పొరేటర్లతో క్యాంపు రాజకీయాలకు తెర తీసింది. తమ కార్పొరేటర్లను మలేషియా తరలించి… అక్కడే కొన్నాళ్ల పాటు ఉంచాలని టీడీపీ తొలుత భావించినా… ఎందుకనో గానీ ఆ నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకుంది. మలేషియాకు బదులుగా విశాఖ పరిధిలోని భీమిలిలోనే కార్పొరేటర్ల క్యాంపును ఏర్పాటు చేసింది. తన టికెట్లపై గెలిచిన కార్పొరేటర్లతో పాటుగా దశలవారీగా తమ గూటికి చేరిన వైసీపీ కార్పొరేటర్లందరినీ టీడీపీ ఈ క్యాంపునకు తరలించింది. మేయర్ పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగేదాకా ఈ క్యాంపును కొనసాగించనున్నట్లుగా సమాచారం. అదే మాదిరిగా చాలా రోజుల క్రితమే బెంగళూరు కేంద్రంగా మొదలైన వైసీపీ క్యాంపు కూడా అప్పటిదాకా కొనసాగనుంది.
ఇదిలా ఉంటే… మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని నెగ్టించాలంటే కూటమికి 74 ఓట్లు అవసరం కానుంది. ఇప్పటికే కూటమి క్యాంపులో 72 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరో ఇద్దరు సభ్యులు వైసీపీ నుంచి జంప్ కొడితే కూటమి ప్లాన్ వర్కవుట్ అయిపోయినట్టే. ఈ దిశగా ఇదివరకే వైసీపీలోని పలువురు కార్పొరేటర్లతో టీడీపీ నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా వైసీపీ శిబిరంలో పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధపడినట్లుగా సమాచారం. ప్రస్తుతం వారు బెంగళూరులోని వైసీపీ క్యాంపులో ఉన్నా… అవిశ్వాసంపై తీర్మానం సందర్బంగా టీడీపీలోకి దూకేస్తారని సమాచారం. ఫలితంగా జీవీఎంసీపై త్వరలోనే కూటమి జెండా ఎగరడం ఖాయమేనని చెప్పాలి.
This post was last modified on April 1, 2025 11:29 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…