Political News

బాబు అడుగుజాడల్లో… ప్రజా సేవలోకి భువనేశ్వరి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణిగానే నిన్నటిదాకా కొనసాగిన నారా భువనేశ్వరి ఇప్పుడు సరికొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారని చెప్పాలి. అనివార్యంగానే ఆమె ప్రజా సేవలోకి అడుగిడాల్సి వచ్చినప్పటికీ… తన భర్త చంద్రబాబుకు చేదోడువాదోడుగా నిలుస్తున్న వైనం ఆకట్టుకుంటోంది. ఓ వైపు భర్త సీఎంగా…మరోవైపు కుమారుడు మంత్రిగా క్షణం తీరిక లేకుండా ప్రజా సేవలో తలమునకలై ఉండగా… వారికి ఓ మోస్తరు దన్నుగా నిలిచేందుకే ప్రజల్లోకి వచ్చిన భువనేశ్వరి తన దూకుడును పెంచేశారు. గడచిన 3 రోజుల పాటు ఆమె చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో విరామం లేని పర్యటన సాగించారు. తాజాగా సోమవారం ఉదయానికే సాగర నగరం విశాఖపట్నంలో ప్రత్యక్షమయ్యారు.

విశాఖలో సోమవారం ఉదయం తాజ్ వరుణ్ గ్రూప్ హోటల్ కు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి భువనేశ్వరి హాజరయ్యారు. సీఎం సతీమణిగా ఉన్నప్పటికీ..భువనేశ్వరి వేదికను ఎక్కకుండా సామాన్యం జనంతో కలిసి కూర్చుని వేడకను తిలకించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైన ఓ పారిశ్రామికవేత్త… తన ప్రసంగంలో భువనేశ్వరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరి గురించి 30 ఏళ్ల నుంచి తెలుసన్న ఆ పారిశ్రామివేత్త.. చంద్రబాబు సీఎం అయిన తర్వాత అనివార్యంగానే భువనేశ్వరి హెరిటేజ్ బాద్యతలను భుజాన వేసుకున్నారని తెలిపారు. ఇక 2023లో చోటుచేసుకున్న రాజకియ పరిణామాలతో అనివార్యంగానే భువనేశ్వరి ఏకంగా ప్రజా జీవితంలోకి కూడా రావాల్సి వచ్చిందని తెలిపారు.

అటు వ్యాపారమైనా… ఇటు రాజకీయాల్లోకి అయినా భువనేశ్వరి ఎంట్రీ అనివార్యంగానే జరిగిందని ఆ పారిశ్రామికవేత్త గుర్తు చేశారు. తనకు తెలియని రెండు రంగాల్లోకి అనివార్యంగానే ప్రవేశించిన భువనేశ్వరి… తనకు తెలియని రంగాలంటూ వాటి నుంచి దూరం జరగలేదని… ఓ గృహిణిగా ఇంటికి ఎలా చక్కదిద్దుకున్నారో… వ్యాపారం, రాజకీయాల్లో ఆమె సత్తా చాటుతున్నారని తెలిపారు. నిజమే మరి… 1995లో చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… అప్పుడప్పుడే చంద్రబాబు ప్రారంభించిన హెరిటేజ్ వ్యాపారాన్ని తన భుజస్కందాలపై వేసుకున్న భువనేశ్వరి… దానిని ఓ విజయవంతమైన కంపెనీగా తీర్చిదిద్దారు. భువనేశ్వరి చేతుల్లో హెరిటేజ్ సంస్థ దినదిన ప్రవర్ధమానంగా ఎదిగిందే తప్పించి ఏనాడూ నేల చూపులు చూసిందే లేదు.

తాజాగా ప్రజా జీవితంలోకి వచ్చేసిన భువనేశ్వరి…చంద్రబాబుతో పాటు లోకేశ్ కు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు సీఎం అయ్యారో… తనను గెలిపిస్తూ వస్తున్న కుప్పం ప్రజలను ఆయన పెద్దగా కలిసిందే లేదు. తన మనిషిగా ఓ నేతను అక్కడ పెట్టి చంద్రబాబు వ్యవహారాన్ని నడిపిస్తూ వచ్చారు. అయినా కూడా కుప్పం ప్రజలకు ఆయన ఏ లోటూ రానివ్వలేదు.

తాజాగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో భువనేశ్వరి నేరుగా రంగంలోకి దూకేశారు. గత వారంలో ఏకంగా 3 రోజుల పాటు ఆమె కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపారు. కుప్పానికి ఇక చంద్రబాబు రావాల్సిన అవసరం లేదని.. అంతా తానే చూసుకుంటానని కూడా ఆమె అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. భువనేశ్వరి దూకుడు చూస్తుంటే… చంద్రబాబుకు ఇకపై అంతగా పనిలేకుండానే ఆమె చాలా కార్యక్రమాలను చక్కపెట్టేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

This post was last modified on March 31, 2025 1:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్మిక ఇక్కడ తప్పించుకుని.. అక్కడ ఇరుక్కుంది

గత దశాబ్ద కాలంలో బహు భాషల్లో విజయాలు అందుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక…

34 minutes ago

కేతిరెడ్డి రాజకీయం వదిలేస్తున్నారా.?

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏది చేసినా వైరల్ అయిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తున్న కేతిరెడ్డి..…

52 minutes ago

స్పెషల్ ఫ్లైట్ లో ముంబైకి కొడాలి నాని

వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు సమాచారం.…

3 hours ago

టీడీపీలో అతిపెద్ద జబ్బు అలక… వదిలించుకుందాం: లోకేశ్

కార్యకర్తే అధినేత కార్యక్రమం తెలుగు దేశం పార్టీలో పక్కాగా అమలు అవుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్వి, ఏపీ మంత్రి…

3 hours ago

మోక్షజ్ఞ ప్రవేశం ఇంకాస్త ఆలస్యం

నందమూరి అభిమానులు ఎదురుచూసే కొద్దీ మోక్షజ్ఞ ఎంట్రీ లేట్ అవుతూనే ఉంది. గత ఏడాది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్యాన్…

4 hours ago

చింత‌మ‌నేని చెయ్యి పెద్ద‌దే.. రంజాన్ రోజు ఏం చేశారంటే!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, దెందులూరు ఎమ్మెల్యే , ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా పేరున్న చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. త‌న చెయ్యి పెద్ద‌ద‌ని…

7 hours ago