Political News

గేట్స్ అగ్రిమెంట్స్‌: ఏపీకి ఓ హిస్ట‌రీ!

ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్ర‌త్యేక‌త ఉంటుంది. అలానే.. ఇక నుంచి మార్చి 19వ తేదీని ఏపీ ప్ర‌జ‌లు, ప్ర‌భు త్వాలు కూడా మ‌రిచిపోలేని విధంగా సీఎం చంద్ర‌బాబు మార్చ‌నున్నారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రం కూడా పూర్తిస్థాయిలో చేయ‌లేని ప‌నిని ఆయ‌న బుధ‌వారం సాధించ‌నున్నారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్‌తో చంద్ర‌బాబు ఏపీకి సంబంధించిన ప‌లు ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇవి సాదా సీదా ఒప్పందాలు అయితే కాదు.

ప్ర‌ధానంగా భ‌విష్య‌త్తు త‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఆధారిత టెక్నాల జీని రాష్ట్రంలో విస్తృత ప‌రిచే ప్రాజెక్టుల‌పై సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని రాష్ట్ర బృందం ఒప్పందం చేసుకోనుంది. ఇది రాష్ట్ర చ‌రిత్ర గ‌తిని భ‌విష్య‌త్తులో మార్చేయ‌డం ఖాయ‌మ‌ని ఐటీ నిపుణులు చెబుతు న్నారు. అంతేకాదు.. ప్ర‌పంచ దేశాలు సైతం ఏపీవైపు చూసే విధంగాఈ మార్పు ఉంటుంద‌ని అంటున్నా రు. దీనితోపాటు.. డేటా కేంద్రాల ఏర్పాటు, ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించిన పెట్టుబ‌డుల‌పై కూడా.. గేట్స్‌తో ఒప్పందాలు చేసుకుంటారు.

అలానే.. నైపుణ్య శిక్ష‌ణ‌లో కీల‌క‌మైన ఏఐ, ఐటీ రంగాల్లోనూ బిల్ గేట్స్ ఫౌండేష‌న్ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన నేప‌థ్యంలో కాకినాడ‌, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, అనంత‌పురం, విశాఖ‌ల్లో బిల్ గేట్స్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యం లో నైపుణ్య శిక్ష‌ణ కేంద్రాల ఏర్పాటుపైనా ఒప్పందాలు జ‌ర‌గ‌నున్నాయి. కృత్రిమ మేథ కు సంబంధించిన యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం త‌ల‌పోస్తున్న నేప‌థ్యంలో నైపుణ్యాభివృద్ధికి పెద్ద‌పీ ట వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

త‌ద్వారా రాష్ట్ర ఆదాయం పెర‌గ‌డంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు మ‌రింత రెట్టింపు కానున్నాయి. సాధార‌ణంగా ఒక పెట్టుబ‌డి రావ‌డం, ఒక ప‌రిశ్ర‌మ రావ‌డం వేరు. కానీ, ఐటీకి సంబంధించి , ముఖ్యంగా ఏఐకి సంబంధించి ద‌క్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబ‌డులు సాధిస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందు వ‌రుస‌లో నిల‌వ నుంది. సో.. బిల్‌గేట్స్‌తో ఒప్పందాలు.. రాష్ట్రానికి అత్యంత కీల‌కంగా మార‌నున్నాయి. బుధ‌వారం మ‌ధ్యాహ్నం.. సీఎం చంద్ర‌బాబు ఢిల్లీలో గేట్స్‌తో జ‌రిగే స‌మావేశంలో కీల‌క‌మైన ఒప్పందాల‌కు శ్రీకారం చుట్ట‌నున్నారు. 

This post was last modified on March 20, 2025 7:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పాత ప‌థ‌కాలు.. భ‌లే జోష్‌.. !

పాత చంద్ర‌బాబును చూస్తారు.. 1995 నాటి ముఖ్య‌మంత్రిని చూస్తారు - అంటూ.. సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా వ్యాఖ్యానిస్తున్న విష‌యం తెలిసిందే.…

36 minutes ago

హైడ్రా పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్య

హైడ్రా పేరు వింటేనే తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు కీలక నగరాల జనం హడలిపోతున్నారు. ఈ ఆందోళనలు…

2 hours ago

వివాదాస్పద సినిమా OTT ఎడిటింగ్ – భగ్గుమన్న దర్శకుడు

భారతీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద సినిమాల్లో ఒకటిగా పేరొందిన చిత్రం బండిట్ క్వీన్. 1994 శేఖర్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన…

4 hours ago

సునీతా విలియమ్స్.. ఇప్పుడు భూమిపై మరింత కఠినంగా..

అంతరిక్షంలో తొమ్మిది నెలలు గడిపిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి చేరుకున్నప్పటికీ, ఆమె సాధారణ జీవనానికి తిరిగి…

5 hours ago

ఫోన్ ట్యాపింగ్ కేసు: ‘రెడ్ కార్న‌ర్’ నోటీసులు

తెలంగాణ రాజ‌కీయాల‌ను పెను కుదుపులకు గురిచేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్య‌వ‌హారం కీల‌క ద‌శ‌కు చేరుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు…

8 hours ago

200 కోట్లు వసూలు చేస్తే ఫ్లాప్ అంటారా

బాలీవుడ్ ప్రముఖుల కామెంట్లు ఒక్కోసారి భలే విచిత్రంగా ఉంటాయి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి, ఒకప్పటి మాజీ హీరోయిన్…

9 hours ago