Political News

అమెరికా ఎన్నికల్లో డబ్బు పాత్ర, పరిమితి ఎంత ?

మనదేశంలో ఉన్నట్లే అగ్రరాజ్యం అమెరికాలో కూడా డబ్బుదే కీలకపాత్రగా చెప్పుకోవాలి. కాకపోతే మనదేశంలో డబ్బులు ఖర్చు చేయటానికి అమెరికాలో చేసే ఖర్చుకు చాలా తేడాలుంటాయి. మనదేశంలో ఎన్నికల వ్యయంపై పరిమితి అన్నది నేతిబీరకాయలో నెయ్యి మాదిరిగానే ఉంటుంది. అదే అమెరికాలో వ్యయపరిమితి అన్నది లేదు కాబట్టి నిధుల ఖర్చులో ఆకాశమే హద్దుగా ఉంటుంది. అదే సమయంలో వాళ్ళు ఖర్చు చేసే ప్రతి రూపాయికి కచ్చితంగా లెక్కలుంటాయి. మన దగ్గరున్నట్లు చేసే ఖర్చు ఒకటైతే చూపించే ఖర్చు మరోటి అన్న పద్దతి ఉండదు.

మన దగ్గర ఎంపికైతే వ్యయ పరిమితి రూ. 75 లక్షలు, ఎంఎల్ఏకి అయితే రూ. 30 లక్షలు దాటకూడదని నిబంధనుంది. అయితే వాస్తవంగా పోటీ చేసే అభ్యర్ధుల ఖర్చు పరిమితికి మించి ఉండటం లేదా ? అంటూ వినేవాళ్ళు అమాయకులైతే నమ్ముతారు. ఎందుకంటే ఓ జనరల్ సీటులో ఎంపిగా పోటీ చేయాలంటేనే కనీసం రూ. 150 కోట్లకు పైగా ఖర్చవుతుంది. ఇదే సందర్భంలో ఎంఎల్ఏ ఖర్చు తక్కువలో తక్కువ రూ. 50 కోట్లంటే నోరెళ్ళబెట్టాల్సిందే. మరి ఎన్నికల వ్యయం పరిమితికి, అవుతున్న ఖర్చకు ఏమన్నా సంబంధం ఉందా ? ఇంకా విచిత్రమేమిటంటే అభ్యర్ధులు చూపించే ఖర్చు ఎన్నికల పరిమితికన్నా తక్కువే చూపటం.

అభ్యర్ధులు చూపించే ఖర్చులో నిజం నేతిబీరకాయ లాంటిదని ఇందుకే చెప్పింది. ఇదే అమెరికాలో అయితే ఆ అవసరమే లేదు. ఎన్నికల ఖర్చులకు సంబంధించి తప్పుడు లెక్కలు చూపించాల్సిన అవసరమే ఉండదు. ప్రస్తుత ఎన్నికల్లో మొన్నటి ఆగష్టుకు డెమక్రాట్ల అభ్యర్ధి జో బైడెన్ కు సుమారు రూ. 7 వేల కోట్లు విరాళాల రూపంలో అందిందట. ఇదే సమయంలో అధ్యక్షుడు, మళ్ళీ ఎన్నికయ్యేందుకు కష్టపడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు రూ. 10 వేల కోట్ల విరాళాలు అందాయట. కాకపోతే ట్రంపుకు వచ్చిన విరాళాల్లో ఎక్కువ భాగం ఖర్చయిపోవటంతో ఇబ్బందులు పడుతున్నాడట. నవంబర్ 3వ తేదీన జరిగే ఎన్నికల్లో దీని ప్రభావం పడచ్చని అనుకుంటున్నారు.

అధ్యక్ష అభ్యర్ధుల ఎన్నికల ఖర్చంతా టీవీల్లో డిబేట్లు, పాంప్లెట్లు, మీడియాలో ప్రకటనలు, పెద్ద పెద్ద హోర్డింగులు, పబ్లిక్ మీటింగులు, ప్రముఖులతో డిన్నర్ సమావేశాలు తదితరాల రూపంలో ఉంటాయి. ఏ పార్టీ అభ్యర్ధికి ఏ రూపంలో విరాళాలు అందుతున్నాయనే విషయం కూడా అంతా క్లారిటితోనే ఉంటుంది. కాబట్టి ఎవరికీ నిధుల విరాళాలు ఇచ్చే విషయంలో కానీ ఖర్చు పెట్టే విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు, దాపరికాలుండవు. అందుకనే అమెరికాలో మొత్తం ట్రాన్స్ పరన్సెగానే ఉంటుంది. మరి మనదగ్గర ఈ పరిస్ధితి ఎప్పుడు వస్తుందో ?

This post was last modified on October 28, 2020 6:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

1 hour ago

‘షా’ మాట‌లు హుష్‌.. బీజేపీ నేత‌లు మార‌రా?

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా నాలుగు రోజుల కింద‌ట ఏపీలో ప‌ర్య‌టించా రు. విజ‌యవాడ…

1 hour ago

వ‌ల‌సల‌పై ట్రంప్ నిర్ణ‌యం.. అమెరికాకు చేటేనా?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎలాంటి మాట‌లు చె ప్పినా.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు…

2 hours ago

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

3 hours ago

ఏమిటీ ‘అనుచితాల’.. ఆపండి: బీజేపీపై ఆర్ ఎస్ ఎస్ ఆగ్ర‌హం!

బీజేపీ మాతృ సంస్థ‌.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ ఎస్ ఎస్‌).. తాజాగా క‌మ‌ల నాథుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు…

3 hours ago

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

4 hours ago