2019 ఎన్నికల ముంగిట వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు, వైఎస్ జగన్ చిన్నాన్న అయిన వివేకానందరెడ్డి మరణం ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ముందేమో ఆయన గుండెపోటుతో చనిపోయాడన్నారు. తర్వాత ఆయనది దారుణమైన హత్య అనే విషయం బయటికి వచ్చింది. ఆపై అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మీద నింద మోపడానికి ప్రయత్నించారు. చివరికేమో ఈ హత్య కేసు వైఎస్ అవినాష్ మెడకే చుట్టుకుంది. జగన్‌కు సైతం ఈ కేసు వల్ల తీవ్ర ఇబ్బందులు తప్పట్లేదు.
ఈ నేపథ్యంలో వివేకా కేసు గురించి ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసును వైసీపీ ఎలా తప్పుదోవ పట్టించిందనే విషయమై మాట్లాడారు. తనే వివేకాను హత్య చేయించినట్లు ఆరోపిస్తూ సాక్షి పత్రికలో ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ కథనం వేయడం గురించి ఆయన ప్రస్తావించారు.
“ఆ రోజు పొద్దునే వాట్సాప్‌లో నాకు ఒక సమాచారం వచ్చింది. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని చూశా. మామూలుగా ఇలాంటి న్యూస్ వచ్చినపుడు నేను ఒకటికి రెండుసార్లు సరి చూసుకుంటాను. కానీ అప్పుడు ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్నా. వివేకాది గుండెపోటే అని నమ్మాను. కానీ మధ్యాహ్నానికి సునీత గారికి అనుమానం వచ్చి పోస్టుమార్టం చేయమంటే ఆయనది హత్య అని బయటపడింది. ఆమె పోస్టుమార్టం అడక్కపోయి ఉంటే అంత్యక్రియలు పూర్తి చేసేసేవారు. వివేకాది గుండెపోటుగానే అందరూ నమ్మేవారు.
నేరాలు ఘోరాలు చేసేవాళ్లు ఎలా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తారు అనడానికి ఇది ఉదాహరణ. హత్య అని బయటికి తెలియగానే నామీద తోసేయడానికి చూశారు. సాక్షి పత్రికలో, టీవీలో నారాసుర రక్తచరిత్ర అని వేసి రాజకీయ ప్రయోజనం పొందాలని చూశారు. 45 ఏళ్ల నా రాజకీయ చరిత్రలో కక్షపూరిత, హత్యా రాజకీయాల జోలికి వెళ్లలేదు. అలా చేసేవాళ్లను రాజకీయాల్లో లేకుండా చేయడానికి ప్రయత్నించాను. వివేకా హత్య కేసులో తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని చంద్రబాబు పేర్కొన్నారు.
This post was last modified on March 12, 2025 6:39 am
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే...…
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…
గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…