Political News

61 అసెంబ్లీ స్థానాల్లో ‘కూట‌మి’ ప‌ట్టు!

ఏపీలో తాజాగా జ‌రిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కూట‌మి ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఉమ్మ‌డి గుంటూరు, కృష్నాజిల్లాల ప‌ట్ట‌భ‌ద్ర ఎమ్మెల్సీ స్థానంతోపాటు.. ఉమ్మ‌డి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ప‌ట్ట‌భ‌ద్ర స్థానంలో కూట‌మి త‌ర‌ఫున పోటీ చేసిన ఇద్ద‌రు నాయ‌కులు ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌ర్ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఒక్కొక్క‌రికీ ల‌క్ష ఓట్ల‌కు పైగానే మెజారిటీ ద‌క్కింది. వాస్త‌వానికి భారీ పోటీ ఉంటుంద‌ని అనుకున్నా.. చివ‌ర కు.. అది తేలిపోయి.. ఏక‌ప‌క్షంగానే విజ‌యం ద‌క్కించుకున్నారు.

అయితే.. ఇది పైకి చూసేందుకు రెండు మండ‌లి స్థానాలే అయిన‌ప్ప‌టికీ.. ఒకింత లోతుగా చూస్తే.. 61 అసెంబ్లీ స్థానాల్లో ఈ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోను.. ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ 61 అసెంబ్లీ స్థానాలు ఉన్నా యి. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిగాయి. దీనిని బ‌ట్టి.. కూట‌మి ప‌ట్టు ఏమాత్రం త‌గ్గ‌లేద‌న్న విష‌యం వెలుగు చూసింది. నిజానికి స‌ర్కారుపై ఏ చిన్న వ్య‌తిరేక‌త ఉన్నా.. ఈ విధంగా ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీ అయితే.. ద‌క్కేది కాద‌న్న అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదొక్క‌టే కాదు.. గ‌త ఏడాది జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పోలైన కూట‌మి ఓట్ల‌తో పోల్చుకుంటే.. తాజాగా న‌మోదైన ఓట్ల‌ను ప‌రిశీలిస్తే.. ఏకంగా 40 శాతం ఓటింగ్ పెరిగింది. ఇది కూట‌మికి సానుకూలంగా ప‌డ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఈ నాలుగు జిల్లాల్లోనూ.. కూట‌మి ప్ర‌భావం మ‌రింత పెరిగింద‌న్న సంకేతాలు కూడా వ‌స్తున్నాయి. గ‌తంలో 61 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి రెండు స్థానాల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకున్నా.. ఇప్పుడు అస‌లు ఎక్కడా ఆ పార్టీ ఊసు లేకుండా పోయింది.

అంతేకాదు.. తాజా ఎన్నిక‌ల్లో పోనీ పోటీ లేద‌ని అనుకుందామంటే.. ఉమ్మ‌డి గుంటూరు, కృష్నాలో 25 మంది, ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో 38 మంది చివ‌రి వ‌ర‌కు పోటీలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. కూట‌మి అభ్య‌ర్థుల‌కు భారీ ఎత్తున ఓట్లు ద‌క్కాయంటే.. మొత్తం 61 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డా స‌ర్కారుపై వ్య‌తిరేక‌త లేద‌ని కూట‌మి నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌జ‌లు, మేధావులు, విద్యావంతులు త‌మ‌వెంటే ఉన్నార‌ని వారు చెబుతున్నారు. ప‌లితాలు కూడా వీరి అంచ‌నాల‌కు మించి ఉండ‌డంతో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on March 5, 2025 6:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

32 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

8 hours ago