Political News

వారందరికీ చంద్రబాబు ఫోన్లు !

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు అలిగారని సమాచారం. కారణమేంటా అంటే… ఈమధ్యనే చంద్రబాబునాయుడు జాతీయ కమిటి, పాలిట్ బ్యూరో నియమించిన విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ కేడర్ డీలా పడింది. పార్టీలో జోష్ నింపే వ్యూహాల్లో భాగంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలలో ఒకటి కమిటీల నియామకం. అయితే… అటు కమిటిలోను, ఇటు పాలిట్ బ్యూరోలోను చోటు దక్కని చాలామంది సీనియర్లు చంద్రబాబుపై అలిగారట. నేరుగా ఎక్కడా తాము అసంతృప్తిని బయటకు వ్యక్తం చేయకుండా తన మద్దతుదారుల ద్వారా బయటపెడుతున్నారట.

ఉన్న ముగ్గురు ఎంపిల్లో గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడుకు పదవులు ఇచ్చిన చంద్రబాబు విజయవాడ ఎంపి కేశినేని నానిని పక్కనపెట్టేశారు. అలాగే గుంటూరులో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, నన్నపనేని రాజకుమారిలకు చోటు కల్పించలేదు. ఇక కృష్ణా జిల్లాలో మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పంచుమర్తి అనూరాధ లాంటి సీనియర్లకు ఏ కమిటిలోను చోటు కనబడలేదు.

ఇదే సందర్భంగా విశాఖనగరంలో మాజీమంత్రి గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళకు కూడా స్ధానం కల్పించలేదు. ప్రకాశం జిల్లాలోని ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావు లాంటి వాళ్ళకు కూడా కమిటిల్లో చోటు దక్కలేదు. గంటా పార్టీని వదిలేస్తాడనే ప్రచారం కారణంగా చోటు కల్పించలేదని అనుకోవచ్చు. కానీ పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న గౌతు శిరీష లాంటి వాళ్ళకు కూడా చోటు ఎందుకు దక్కలేదో తెలీదు.

ఇదే విషయమై అనేకమంది సీనియర్ నేతలు పార్టీ అధినేతపై అసంతృప్తితో మండిపోతున్నారట. అయితే ఈ విషయం గ్రహించిన చంద్రబాబు అసంతృప్తితో ఉన్న నేతలకు నేరుగా ఫోన్లు చేసి మరీ బుజ్జగిస్తున్నారు. జాతీయ కమిటిలో కానీ పాలిట్ బ్యూరో లో కానీ చోటు కల్పించలేకపోయిన కారణాలను వివరించి చెబుతున్నారట. రాష్ట్ర కమిటిలో తప్పక స్ధానం కల్పిస్తానని హామీ ఇస్తున్నారట. నిజంగా ఆలోచిస్తే పార్టీ నేతల్లో ఎంతమందికని చంద్రబాబు మాత్రం చోటు కల్పించగలుగుతారు ? సీనియర్లందరికీ కమిటిల్లో చోటు కల్పించాలంటే ప్రతి కమిటిలోను వందలమందిని నియమించాల్సుంటుంది. మరి చంద్రబాబు బుజ్జగింపులు ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి.

This post was last modified on October 26, 2020 10:51 am

Share
Show comments
Published by
satya

Recent Posts

తమన్నా రాశిఖన్నా ‘బాక్’ రిపోర్ట్

ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్‌మనై 4 మీద కాస్తో కూస్తో…

14 mins ago

వరలక్ష్మి ‘శబరి’ ఎలా ఉంది

తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…

39 mins ago

గెలిస్తే ఎంపీ .. ఓడితే గవర్నర్ !

ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…

43 mins ago

ఆ పార్టీలో అందరూ కాబోయే మంత్రులే !

భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…

2 hours ago

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

13 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

14 hours ago