రాష్ట్ర బీజేపీలో విచిత్రమైన పరిస్దితులు కనబడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా రాష్ట్ర బిజేపీలో చాలామంది ఇతర పార్టీల నుండి వచ్చి చేరిపోతారని మొదట్లో కమలనాధులు అనుకున్నారు. అయితే కేంద్రంలో అధికారం విషయాన్ని పక్కనపెట్టేస్తే రాష్ట్రంలో మాత్రం పార్టీ ఏమాత్రం బలపడలేదన్న విషయం తెలిసిపోతోంది. ఎందుకంటే కేంద్రంలో ఇంకా ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో మాత్రం కనీసం గట్టి ప్రతిపక్షంగా కూడా ఎదగలేదనే అనుమానాలుండటమే ప్రధాన కారణం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గడచిన మూడు మాసాల్లో ఆరుగురు నేతలను పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ లైన్ దాటి స్వతంత్రంగా మాట్లాడుతున్నారనే కారణంగా వీరందరిపై సస్పెన్షన్ వేటు వేసింది పార్టీ. సస్పెండ్ అయిన నేతల్లో టీడీపీ నుండి కమలం పార్టీలో చేరిన వాళ్ళే ఎక్కువున్నారు. అదే సమయంలో బీజేపీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు.
పార్టీ లైనంటే ప్రధానంగా అమరావతి ఇష్యూనే వస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షునిగా ఉన్నంత కాలం నేతలను ఓ కారణంతో సస్పెండ్ చేస్తే సోము వీర్రాజు బాధ్యతలు తీసుకున్న తర్వాత మరో కారణంగా సస్పెండ్ అవుతున్నారు. పార్టీతో దాదాపు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్న కుమారరాజను కన్నా సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారంటే అనుమతి లేకుండానే టీవీ చర్చల్లో పాల్గొన్నారని.
ఇక సోము అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెలగపూడి గోపాలకృష్ణ, రామకోటయ్యలను సస్పెండ్ చేశారు. ఎందుకంటే అమరావతిపై పార్టీలైనుకు భిన్నంగా మాట్లాడినందుకట. అలాగే తాజాగా లంకా దినకర్ ను కూడా పార్టీ నుండి వీర్రాజు సస్పెండ్ చేసేశారు. ఎందుకంటే పార్టీ వద్దన్నా టీవీ చర్చల్లో పాల్గొన్నారనే కారణం చెబుతున్నారు. ఒక్క కుమారరాజా తప్ప మిగిలిన వాళ్ళపైన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇదే సమయంలో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి, అన్నం సతీష్ లాంటి వాళ్ళ గొంతులే ఎక్కడా వినబడటం లేదు. టీడీపీ నుండి బిజేపీలో చేరిన నేతల్లో చందు సాంబశివరావు మాత్రమే టీవీ చర్చల్లో తరచూ కనబడుతున్నారు. మొత్తం మీద బీజేపీలో చేరిన నేతలకన్నా సస్పెండ్ అయి బయటకు వెళ్ళిపోయిన నేతల సంఖ్యే ఎక్కువగా ఉందని పార్టీలో జోకులేసుకుంటున్నారు.
This post was last modified on October 25, 2020 4:00 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…