దళిత యువకుడు ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ప్రస్తుతం పోలీసుల కస్డడీలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించగా… తొలి రోజు కస్టడీ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కేంద్రంగా విచారణ జరగగా… వంశీ తాను ముందుగా నిర్దేశించుకున్న సమాధానాలనే పోలీసుల ఎదుట చెప్పినట్లుగా తెలుస్తోంది. విచారణలో పోలీసులు తనను ఏమేం ప్రశ్నలు అడుగుతారన్న దానిపై ఓ అంచనా వేసిన వంశీ.. ఆ ప్రశ్నలకు ముందుగానే సమాధానాలు సిద్ధం చేసుకున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఎలా జరిగిందన్న దానిపై ఇటీవలే వంశీని జైలులో కలిసి వచ్చిన సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారని…ఒకానొక సమయంలో గన్నవరం వైసీపీ కార్యాలయంపై దాడికి ఆయన యత్నించారని.. ఈ క్రమంలోనే కోపోద్రిక్తులైన వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయంపై దాడికి యత్నించారని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. సేమ్ టూ సేమ్ వంశీ నోట కూడా మంగళవారం ఇదే వాదన బయటకు వచ్చిందట. గన్నవరం టీడీపీ కార్యాలయంపై ఎందుకు దాడి చేయించారని పోలీసులు అడిగితే… జగన్ చెప్పిన వాదననే వంశీ పూసగుచ్చినట్లుగా వివరించారట.
ఇక పోలీసులు అడిగిన మరిన్ని ప్రశ్నలకు కూడా వంశీ దాటవేత సమాధానాలనే ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను మొత్తం మూడు ఫోన్లను వాడుతున్నానని చెప్పిన వంశీ.. ఆ మూడింటిని ఎక్కడ పెట్టానో తెలియడం లేదని చెప్పారట. ఇక సత్యవర్ధన్ హైదరాబాద్ లోని తన ఇంటికి వచ్చిన మాట నిజమేనని ఒప్పుకున్న వంశీ… అసలు అతను సత్యవర్ధన్ అని తనకు తెలియదని చెప్పారట. ఎవరితోనో కలిసి తన ఇంటికి వచ్చిన సత్యవర్ధన్ ఓ రాత్రి తన ఇంటిలో విశ్రాంతి తీసుకుని ఆ మరునాడు వెళ్లిపోయాడని.. అయితే అతడు ఎక్కడికి వెళ్లిపోయాడో మాత్రం తనకు తెలియదని తెలిపారట. సత్యవర్ధన్ ను తానేమీ బెదిరించలేదన్న వంశీ… కోర్టుకు సత్యవర్ధనే వెళ్లి వాంగ్మూలం ఇచ్చారని… ఈ విషయంలో తన ప్రమేయం ఎంతమాత్రం లేదని తెలిపారట.
ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ తర్వాత వంశీ..హైదరాబాద్ నుంచి తాడేపల్లి వెళ్లారని, ఈ సందర్భంగా తన లొోకేషన్ పోలీసులకు తెలియకుండా ఉండేలా సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని అంశంపైనా వంశీ తనదైన శైలి సమాధానాలు చెప్పారట. హైదరాబాద్ నుంచి తాను తాడేపల్లి వెళ్లిన మాట వాస్తవమేనని ఒప్పుకున్న వంశీ… అందరూ అనుకుంటున్నట్లుగా తాడేపల్లిలో తాను ఎవరితోనూ కలవలేదని తెలపారట. ఎవరినీ కలవనప్పుడు హైదరాబాద్ నుంచి తాడేపల్లి ఎందుకు వెళ్లినట్లు అంటే…వంశీ నుంచి మౌనమే సమాధానమైందని సమాచారం. ఈ ప్రశ్నలన్నింటినీ పోలీసులు పలు ఆధారాలు వంశీ ముందు పెట్టి మరీ సంధించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే సత్యవర్థన్ తన ఇంటికి వచ్చిన విషయాన్ని… తాను తాడేపల్లి వెళ్లిన విషయాన్ని వంశీ దాటవేయలేకపోయారని తెలుస్తోంది..
This post was last modified on February 26, 2025 10:14 am
జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…
మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…