Political News

య‌న‌మ‌ల సేఫ్‌.. వంగ‌వీటికి ల‌క్ ..!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుతం మండ‌లిలో టీడీపీ ప‌క్ష నాయ‌కుడిగా కూడా ఉన్న య‌న‌మ‌ల రా మ‌కృష్ణుడు సేఫ్‌జోన్‌లోనే ఉన్నార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఆయ‌న ప‌ద‌వీ కాలం.. వ‌చ్చే నెల‌తో ముగియ నుంది. దీంతో తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల జాబితాలో ఈయ‌న సీటు కూడా చేరింది. అయి తే.. ఈయ‌న‌ను వ‌దులుకునే అవ‌కాశం చంద్ర‌బాబుకు లేద‌ని అంటున్నారు పార్టీ సీనియ‌ర్లు. వైసీపీ హ‌యాంలో మూడు రాజ‌ధానుల బిల్లు మండ‌లికి వ‌చ్చిన‌ప్పుడు.. య‌న‌మల సారథ్యంలో మండ‌లిలో బాగానే ఫైట్ చేశారు.

అంతేకాదు.. మండ‌లిని బ‌లోపేతం చేయ‌డంలోనూ.. వైసీపీకి అప్ప‌ట్లో చుక్క‌లు చూపించ‌డంలోనూ య‌నమ‌ల కీల‌క రోల్ పోషించారు. ఇక‌, తాజాగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం తునిలోనూ చ‌క్రం తిప్పారు. అనేక ఇబ్బందులు వ‌చ్చినా.. తుని స్థానిక సంస్థ‌ను టీడీపీ ప‌రం చేయడంలో ఆయ‌న విశేషంగానే ప‌నిచేశారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చాక త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని అనుకున్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఇవ్వ‌లేదు.

దీంతో య‌న‌మ‌ల అసంతృప్తితో ఉన్నారు. సుదీర్ఘ‌కాలం టీడీపీతో ఉన్న అనుబంధం, పైగా సీనియ‌ర్ నాయ‌కుడు.. కావ‌డంతో చంద్ర‌బాబు ఆయ‌న‌ను వ‌దులుకునే ప్ర‌య‌త్నం చేయ‌ర‌ని.. మ‌రోసారి ఆయ‌న‌కు రెన్యువ‌ల్ చేస్తార‌ని చెబుతున్నారు. ఇదే జ‌రిగితే.. య‌న‌మ‌ల మ‌రోసారి మండ‌లికి ఎన్నిక కానున్నారు. ఇదిలావుంటే.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కూడా.. టీడీపీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేసిన విజ‌య‌వాడ‌కు చెందిన వంగ‌వీటి రాధాకు ఈ ద‌ఫా మండ‌లి సీటు ఇస్తార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

కాపు కోటాలో కాక‌పోయినా.. పార్టీపై ఆయ‌న చూపుతున్న ప్రేమ‌, అభిమానం వంటివి ప‌నిచేస్తాయ‌న్న చ‌ర్చ ఉంది. పైగా.. ఇప్ప‌టి వ‌రకు సుదీర్ఘ కాలంగా ఆయ‌న చ‌ట్ట‌స‌భ‌ల‌కు దూరంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను మండ‌లికి పంపించే అవ‌కాశం ఉంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. కానీ, లైన్‌లో మాత్రం విజ‌య‌వాడ‌కు చెందిన బుద్దా వెంక‌న్న, మైనారిటీ కోటాలో.. జ‌లీల్ ఖాన్ వంటి వారు ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నిర్ణ‌యం ఎలా ఉంటుందో చూడాలి.

This post was last modified on February 25, 2025 5:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

45 minutes ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

57 minutes ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

2 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

4 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

6 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

6 hours ago