Political News

అప్పుడు టిక్కెట్టు పొందిన నాయకులు ఇప్పుడు ఎక్కడ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. చేసిన ప్ర‌యోగాలు విక‌టించాయి. ఎమ్మెల్యేల‌ను, ఎంపీ ల‌ను మార్పు చేయ‌డంతోపాటు.. తాను ఏరికోరి ఎంపిక చేసిన వారికి ఇచ్చిన టికెట్ల స్థానాల్లోనూ పార్టీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. స‌రే.. ప్ర‌జాస్వామ్యంలో గెలుపు, ఓటములు కామ‌నే.. అనుకున్నా.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు కూడా వైసీపీకి ఏమాత్రం క‌లిసి రావ‌డం లేదు. దీంతో ప్ర‌యోగాలే కాదు.. నాయ‌కులు కూడా కొర‌గాకుండా పోయార‌న్న చ‌ర్చ అయితే సాగుతోంది.

ఏం జ‌రిగింది ..

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తిరువూరు, మైల‌వ‌రం, విజ‌య‌వాడ ప‌శ్చిమ స‌హా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త ముఖాల‌కు అవ‌కాశం క‌ల్పించారు. వీరంతా సాధార‌ణ వ్య‌క్తులే. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ స‌ర్కారు అమ‌లు చేసిన న‌వ‌ర‌త్నాల కార‌ణంగా.. ఎవ‌రిని నిల‌బెట్టినా గెలిచేస్తార‌ని జ‌గ‌న్ అంచ‌నా వేసుకున్నారు. అందుకే ఎక్క‌డా ఎవ‌రు వెళ్లిపోతున్నా.. జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. క‌నీసం వారితో చ‌ర్చించే ప్ర‌య‌త్నం కూడా చేయ లేదు. ఫ‌లితంగా ప‌దుల సంఖ్య‌లో వెళ్లిపోయారు.

ఆయా స్థానాల్లో కొత్త ముఖాల‌కు జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు. వీరిని తానే గెలిపించుకుంటాన‌ని కూడా జ‌గ‌న్ చెప్పారు. అయితే.. వారు విజ‌యం సాధించ‌లేదు. క‌ట్ చేస్తే.. ఓడిన వారు ఇప్పుడు ఎక్క‌డున్నారంటే.. గ‌త ఎన్నిక‌లకు ముందు ఏయే వృత్తుల నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి వైసీపీ కండువా క‌ప్పుకొన్నారో.. ఇప్పు డు ఆయా ప‌నుల్లోనే వారు నిమ‌గ్న‌మ‌య్యారు. దీంతో పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించే వారు లేకుండా పోయారు.

త‌మ త‌మ వృత్తులే త‌మ‌కు క‌డుపునింపుతాయ‌ని కూడా చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో మైల‌వ‌రం, తిరువూరు, విజ‌య‌వాడ వెస్ట్ వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ద‌రు నేత‌లు క‌నిపించ‌డ‌మే లేదు. ఇక్క‌డే కాదు.. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌యోగాలు చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఇలానే ఉంది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల‌ను మార్పు చేసిన చోట కూడా వైసీపీ మాట విన‌ప‌డ‌డం లేదు. దీంతో జ‌గ‌న్ చేసిన ప్ర‌యోగాల‌తో పాటు.. తీసుకువ‌చ్చిన నాయ‌కులు కూడా విక‌టించార‌న్న చ‌ర్చ జోరుగా జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on February 18, 2025 2:01 pm

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

8 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

21 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

32 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago