Political News

ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్స్‌… టీడీపీ గెలుపు ఈజీయేనా?

ఏపీలో మూడు శాస‌న మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇవి ఉపాధ్యాయ‌, ప‌ట్ట‌భ‌ద్ర స్థానాలు కావ‌డంతో రాజ‌కీయ పార్టీల‌కు నేరుగా ప్ర‌మేయం లేదు. అయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయ నేత‌లే ఈ ఎన్నిక‌ల్లో త‌ల ప‌డుతున్నారు. ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మిన‌హా..మిగిలిన రెండు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా.. ప‌ట్ట‌భ‌ద్రుల‌కు సంబంధించిన‌వి. ఉమ్మ‌డి తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్ర స్థానం, ఉమ్మ‌డి గుంటూరు, కృష్ణాజిల్లాల‌కు చెందింది మ‌రోస్థానం.

ఈ రెండు కూడా.. టీడీపీ నాయ‌కులే పోటీ చేస్తున్నారు. ఉమ్మ‌డి గుంటూరు-కృష్ణాలో మాజీ మంత్రి ఆల‌పా టి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల్లో పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌రం బ‌రిలో నిలిచారు. ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల త‌ర‌ఫున‌.. వీరే క‌నిపిస్తున్నారు. మిగిలిన వారిలో చాలా మంది స్వ‌తంత్రులు. ఒక‌రిద్దురు మాత్రం చిన్నా చిత‌కా పార్టీల మ‌ద్ద‌తుతో బ‌రిలో ఉన్నారు. ఇక‌, ప్ర‌తిప‌క్షం వైసీపీ మాత్రం ఈ ఎన్నిక‌ల‌కు క‌డు దూరంలో నిలిచింది. అంటే.. ఒక ర‌కంగా ప్ర‌స్తుతం ఉన్న వారి మ‌ధ్య పోటీ ఉండే అవ‌కాశం లేదు.

దీంతో టీడీపీ అభ్య‌ర్థులు.. ఆల‌పాటి, పేరాబ‌త్తుల విజ‌యంపై త‌మ్ముళ్లు ముందుగానే ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, నామినేష‌న్ల ప్ర‌క్రియ గురువారంతో ముగిసింది. దీంతో ప్ర‌చారంపై నాయ‌కులు దృష్టి పెట్టారు. ఇత‌ర ఎన్నిక‌ల మాదిరిగా కాకుండా.. కేవ‌లం ప‌ట్టభ‌ద్రులు మాత్ర‌మే ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. వీరిని ఆక‌ర్షించేందుకు.. ఆక‌ట్టుకునేందుకు నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డిగా కూట‌మి నాయ‌కులు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

మ‌రోవైపు.. సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై త‌న‌దైన అంచ‌నాల‌ను వేసుకున్నారు. నాయ‌కులు అంద‌రూ.. క‌ద‌లి రావాల‌ని, క‌ల‌సి రావాలని కూడా సూచిస్తున్నా.. పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకో వ‌డం లేదు. దీంతో టీడీపీ అభ్య‌ర్థుల గెలుపుపై అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. పైగా ప్ర‌జ‌ల్లో ప‌థ‌కాల అమ‌లుపై ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. దీంతో ఈ ప్ర‌భావం త‌గ్గించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుని.. మ‌రోవైపు ఎన్నిక‌ల్లోనూ దూకుడు పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on February 15, 2025 6:31 am

Share

Recent Posts

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

31 minutes ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

2 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

2 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

3 hours ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

7 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

8 hours ago