ఆమంచి కృష్ణమోహన్. చీరాల మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ, ఆయన పరిస్థితి డోలాయమానంలో ఉంది. గత ఏడాది ఎన్నికలకు ముందు.. వైసీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ టికెట్‌పై చీరాల నుంచి బరిలో నిలిచారు. వ్యక్తిగత హవాతో నెగ్గుకు రావాలని భావించారు. నిజానికి 2014లో ఇలానే జరిగింది. వ్యక్తిగత ఇమేజ్‌ను ఆయన ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకు వినియోగించుకున్నారు. విజయం సాధించారు. ఆ తర్వాత.. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ గూటికి చేరారు.
ఇక, 2019 ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తారో లేదో అన్న అపనమ్మకంతో అనూహ్యంగా వైసీపీ చెంతకు చేరిపోయారు. అయితే.. ఆయన టికెట్ దక్కించుకున్నా.. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ హవా కొనసాగినా విజయం దక్కించుకోలేకపోయారు. ఇక, ఆ తర్వాత.. నియోజకవర్గాల మార్పులు.. వైసీపీలో అవమానాలు.. తన మాట నెగ్గక పోవడం ఇవన్నీ గుండుగుత్తగా ఆమంచిపై ప్రభావం చూపించాయి. దీంతో వైసీపీ నుంచి బయటకు వచ్చాయి. తనకు నచ్చిన, తనను మెచ్చిన చీరాలనే ఎంచుకున్నారు.
చివరాఖరుకు.. ఏదో ఒక పార్టీ అండ అవసరమని భావించారో.. లేక షర్మిల ఇమేజ్‌తో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని లెక్కలు వేసుకున్నారో.. తెలియదు కానీ.. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ, ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి ఆమంచి దూరంగా ఉంటున్నారు. రాజకీయాలకు సైతం దూరంగా ఉంటూ వచ్చారు. కానీ, ఇప్పుడు వ్యక్తిగతంగా చూసుకుంటే.. ఆయన పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో జనసేన వైపు ఆయన చూపులు సాగుతున్నాయని కొన్నాళ్లుగా చర్చ సాగుతోంది.
తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జనసేనలోకి ఆమంచి ఎంట్రీ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. వచ్చే నెలలో ఆయన ఎంట్రీ ఉంటుందని అనుచరులు చెబుతున్నారు. ఆ వెంటనే నామినేటెడ్ పదవిని కూడా ఆయనకు ఆఫర్ చేయొచ్చని తెలుస్తోంది. ఇక్కడే మరో విషయం ఏంటంటే.. ఆమంచి సోదరుడు స్వాములు.. గత ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. అయితే.. ఆయన కోరుకున్న టికెట్ కాకుండా.. గిద్దలూరు టికెట్ దక్కడంతో బయటకు వచ్చారు.
అప్పటి నుంచి ఆమంచి ఫ్యామిలీతో జనసేన కూడా దూరంగా ఉంది. కానీ, బలమైన నాయకులు, సామాజికవర్గం కావడంతో ఇప్పుడు కృష్ణమోహన్‌ను చేర్చుకునేందుకు ప్రాధమికంగా పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. కృష్ణమోహన్ తర్వాత స్వాములు సైతం ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ఈ కుటుంబానికి సన్నిహితంగా ఉండే నాయకులు చెబుతున్నారు.
This post was last modified on January 24, 2025 7:03 pm
కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల…
వైసీపీ మరింత డీలా పడనుందా? ఆ పార్టీ వాయిస్ మరింత తగ్గనుందా? అంటే.. ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం…
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…