గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును సొంతం చేసుకున్నారని.. వందల కోట్లు విలువైన ఆస్తుల్ని కారుచౌకగా కొట్టేశారంటూ అప్పట్లో ఆయన చేసిన ఫిర్యాదు పెను దుమారంగా మారటం తెలిసిందే. ఈ సీ పోర్టు.. సెజ్ వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ఫ్యామిలీకి చెందిన అరబిందో సొంతం చేసుకోవటం రాజకీయ రగడకు కారణమైంది. ఇదిలా ఉంటే..తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటు.. ఈడీ.. సీఐడీ పుణ్యమా అని కేవీ రావుతో ఇష్యూను సెటిల్ చేసుకోవటానికి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
ఏపీలో అధికార బదిలీ నేపథ్యంలో చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాలతో ఈ ఇష్యూ కొత్త మలుపు తీసుకున్నట్లుగా చెబుతుననారు. కర్నాటి వెంకటేవ్వరరావు నుంచి బలవంతంగా లాక్కున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. కాకినాడ సీపోర్టుతో పాటు సెజ్ ను కూడా కేవీ రావుకు తిరిగి ఇచ్చేసేందుకు వీలుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక డీల్ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది.
కేవీ రావు ఆరోపణల ప్రకారం చూస్తే.. తనను బెదిరించి.. కేసులు పెట్టి.. జైలుకు పంపుతామంటూ ఒత్తిడి చేసి రూ.2500 కోట్ల విలువైన వాటాలను రూ.494కోట్లకు.. కాకినాడ సెజ్ లోని రూ.1109 కోట్ల విలువైన వాటాల్ని రూ.12 కోట్లకు బలవంతంగా లాక్కున్నారని.. దానిని అరబిందోకు బదలాయించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వై విక్రాంత్ రెరడ్డి.. విజయసాయిరెడ్డి.. పి.శరత్ చంద్రారెడ్డి.. పీకేఎప్ శ్రీధర్.. సంతానం ఎల్ ఎల్పీ..అరబిందో రియాలిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు డైరెక్టర్లు తదితరులు ఉన్నారు.
ఈ వ్యవహారం అంతకంతకూ ముదిరి.. చివరకు అరబిందోకు ఇబ్బందిగా మారిందన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఇరు వర్గాల మధ్య రాజీ ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. తాము సొంతం చేసుకున్న సీ పోర్టు.. సెజ్ లను కేవీ రావుకు ఇచ్చేయటం.. అందుకు బదులుగా గతంలో వారు చెల్లించిన మొత్తానికి వడ్డీతో కలిపి ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు.
This post was last modified on January 22, 2025 10:49 am
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…