వైసీపీ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై బయటకు వచ్చారు. కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు చంద్రబాబుకు భారీ ఊరటనిచ్చింది.
చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అంతేకాదు, పిటిషనర్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేశారని, కాబట్టి బెయిల్ రద్దు పిటిషన్ లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే, అవసరమైన సందర్భంలో విచారణకు చంద్రబాబు సహకరించాలని ఆదేశించింది. తాజాగా సుప్రీం కోర్టు తీర్పుతో చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది.
2023 నవంబరులో ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఆ బెయిల్ రద్దు చేయాలంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుపై జగన్ కక్షపూరితంగా అక్రమ కేసు పెట్టారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన చంద్రబాబు ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
This post was last modified on January 16, 2025 10:13 am
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…