ఏపీ రాజధాని అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు పండగ పూట భారీ కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచి పోయిన కౌలు సొమ్ములను వారి ఖాతాల్లో జమ చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు సీఆర్ డీఏ పరిధిలో వాణిజ్య, నివాస స్థలాలు ఇవ్వడంతోపాటు.. రాజధాని నగరం పూర్తయ్యే వరకు వారికి కౌలు సొమ్ము ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2016 నుంచి కూడా ఇక్కడి రైతులు కౌలు సొమ్ము అందుకుంటున్నారు.
వైసీపీ హయాంలో అమరావతిని అటకెక్కించారు. ఇదేసమయంలో ఇక్కడి రైతులకు కూడా కౌలు నిలిపి వేశారు. అయితే.. అనేక న్యాయ పోరాటాల తర్వాత.. హైకోర్టు ఆదేశాలతో అప్పటి ప్రభుత్వం కౌలు సొమ్ములను విడతల వారీగా జమ చేస్తూ వచ్చింది. అయితే ఎన్నికలకు ఏడాది ముందు నుంచి మళ్లీ మారం చేసింది.
ఇస్తాం.. చూస్తాం.. అంటూ కాలం గడిపేసింది. ఇంతలో ఎన్నికలు రావడం.. కూటమి సర్కారు కొలువు దీరడం తెలిసిందే. దీంతో రైతులకు ఇవ్వాల్సిన బకాయి కౌలు సొమ్ములపై కసరత్తు చేసింది.
తాజాగా పెండింగులో ఉన్న ఏడాదిన్నర కౌలు సొమ్మును మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పండుగ ముందు కౌలు సొమ్ముల రాకతో రైతులు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు వైసీపీ హయాంలో మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి.. వివిధ ప్రాంతాల్లోని వారికి ఇక్కడ భూములు కేటాయించారు. దీనిని కూడా అప్పట్లోనే రైతులు వ్యతిరేకించారు. ఇది కూడా కోర్టుల వరకు వెళ్లింది. దీనిపై కోర్టులు ఏమీ తేల్చలేదు.
తాజాగా ఈ భూముల వ్యవహారంపైనా కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆయా భూములను రద్దు చేస్తూ.. వాటిని తిరిగి సీఆర్ డీఏకు అప్పగించింది. అదే సమయంలో ఇక్కడ భూములు పొందిన పేదలకు టిడ్కో నివాసాలను కేటాయించాలని నిర్ణయించింది.
ఇది కూడా రాజధాని రైతులకు ఆనందం కలిగిస్తోంది. మొత్తంగా సంక్రాంతి సమయంలో కూటమి ప్రభుత్వం రాజధాని రైతులకు అటు సొమ్ములు, ఇటు భూముల రూపంలో కానుకలు అందించిందన్న టాక్ వినిపిస్తోంది.
This post was last modified on January 15, 2025 1:17 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…