తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రకటించిన పరిహారం అందజేతకు బోర్డు సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి పేర్లను ప్రకటించిన నాయుడు…వారి కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం అందిస్తాని తెలిపారు.
ఇక వైకుంఠ ద్వార దర్శనాలకు గతంలో మాదిరే 10 రోజుల పాటు కొనసాగిస్తారా?… లేదంటే రెండు రోజులకే పరిమితం చేస్తారా? అంటూ మీడియా ప్రతినిధులు బోర్డును ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు స్పందించిన నాయుడు… ప్రస్తుతం 10 రోజుల దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లను చేశామని… భక్తులు కూడా ఆ మేరకే ప్రణాళికలు చేసుకున్నారని తెలిపారు. ఫలితంగా ఈ ఏడాది 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలను కొనసాగిస్తామన్నారు. వచ్చే ఏడాదికి సంబందించి ఆలోగా దానిపై సమగ్రంగా సమీక్ష జరిపి… నిపుణుల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఇక బోర్డు చైర్మన్ సహా మొత్తం సభ్యులంతా భక్త కోటికి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మీడియా గుర్తు చేసింది. ఈ విషయంపై నాయుడు తనదైన శైలిలో స్పందించారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో క్షమాపణలు చెప్పడంలో తప్పు లేదని పేర్కొన్న ఆయన… క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఎవరో ఏదో అంటే… దానిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని కూడా ఆయన అన్నారు. ఈ దఫా తప్పు జరిగిపోయిందని… ఇకపై అలాంటి తప్పు జరగనివ్వబోమని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ ఘటనకు బాధ్యులుగా తేలిన వారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని నాయుడు తెలిపారు.
This post was last modified on January 10, 2025 7:27 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…