ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా అభిమానించే వారికి సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిన్నటివరకు ఆయన మంచితనం చేతకానితనంగా… పెద్దరికం… చాదస్తంగా మారిపోయింది అనే భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచారు కొందరు.
చర్యల కత్తి ఝుళిపిస్తే తప్పించి మాట వినని వ్యవస్థలను గాడిలోకి పెట్టాలంటే.. అందుకు తగ్గట్లే వ్యవహరించాలే తప్పించి.. చూసిచూడనట్లుగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందన్న నిజాన్ని చంద్రబాబు ఎప్పుడు గ్రహిస్తారో అనే ఆరోపణలు వచ్చాయి నిన్నటి వరకు. ఈ భిన్నాభిప్రాయాలు, ఆరోపణలకు స్వస్తి పలికారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
తిరుపతి తొక్కిసలాట వ్యవహారంలో ఇద్దరు అధికారుల మీద సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేయగా… తిరుపతి ఎస్పీగా వ్యవహరిస్తున్న సుబ్బారాయుడి విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. దీనికి కారణం.. ఏరి కోరి తెచ్చుకున్న అధికారులు ఎంత అలెర్టుగా పని చేయాలి? ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉండేందుకు ఎంత శ్రమించాలన్న విషయాన్ని మర్చిపోయినప్పుడు అందుకు తగిన శాస్తి అవసరమన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించారు చంద్రబాబు.
తిరుపతి తొక్కిసలాట ఉదంతాన్ని సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు ఆగ్రహం మామూలే అయినా.. అది పాల పొంగులా ఉంటుందని చెబుతారు కొందరు. తాజా విషాద ఉదంతాన్ని మాత్రం ఆయన భితన తీరుకు భిన్నంగా వ్యవహరించారన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడి మీద వేటు వేయటమే.
2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఆయనకు ముఖ్య భద్రతా అధికారిగా సుబ్బరాయుడు పని చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అదే సుబ్బారాయుడిని తెలంగాణ నుంచి డిప్యుటేషన్ మీద ఏరి కోరి తీసుకొచ్చి.. అత్యంత కీలకమైన తిరుపతి జిల్లాకు ఎస్పీగా నియమించారు.
అలాంటిది.. అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఆరు నిండు ప్రాణాలు పోవటమే కాదు.. ప్రభుత్వానికి మాయని మచ్చలా మారిన నేపథ్యంలో ఆయనపై వేటు వేసి, బాధ్యత తీసుకొని దానికి అనుగుణంగా పని చేయకపోతే ఎంతటి వారిని అయినా ఉపేక్షించేది లేదని నిరూపించారు.
ఆ వేటు ఎంత వేగంగా అమలైందంటే.. తిరుపతి పర్యటనలో ఆదేశాలు జారీ చేస్తే.. ఆయన తిరిగి విజయవాడకు చేరుకునేసరికి.. బదిలీ ఉత్తర్వులూ జారీ అయిపోయాయి. కీలక స్థానాల్లో ఉన్న అధికారులు.. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారు.. పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. తమను ఏమీ అనరన్నట్లుగా వ్యవహరించే వారికి తాజా నిర్ణయంతో వార్నింగ్ ఇచ్చేసినట్లుగా చెబుతున్నారు.
ఏమైనా.. బాబులో ఈ స్థాయిలో ఆగ్రహావేశాలు చాలా రోజుల తర్వాత చూసినట్లుగా కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on January 10, 2025 2:38 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…